Hanuman : 3D వెర్షన్ లో రాబోతున్న ‘హనుమాన్’..విడుదల తేదీ ఎప్పుడంటే!
Hanuman 3D Version : జనవరి 12 వ తారీఖున అతి చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన చిత్రం ‘హనుమాన్’. ఈ సినిమా విడుదలకు ముందు చాలా రాజకీయాలను ఎదురుకోవాల్సి వచ్చింది. మా సినిమాకి పోటీగా దింపితే థియేటర్స్ దక్కకుండా చేస్తా అని సవాలు చేసి, మొదటి రోజు ఈ చిత్రానికి థియేటర్స్ రానివ్వకుండా చేసారు. కానీ కంటెంట్ ఉన్న సినిమా పవర్ ముందు ఎవ్వరూ నిలబడలేరు అనడానికి ఉదాహరణగా నిల్చింది ఈ చిత్రం.
ఎవరైతే ఈ సినిమాని తొక్కాలని చూశాడో, అతనికి ఇప్పుడు అక్షరాలా 20 కోట్ల రూపాయిల నష్టం వాటిల్లింది. ఇది ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ లాస్ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. దేవుడి సినిమాతో పెట్టుకుంటే ఫలితం అలాగే ఉంటుంది అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేసారు. ఇప్పటికే 250 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, 300 కోట్ల రూపాయిలను వసూలు చేసే దిశగా అడుగులు వేస్తుంది.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాని ఇప్పుడు 3D వెర్షన్ లోకి మార్చి విడుదల చెయ్యడానికి మూవీ టీం చాలా సీరియస్ గా కసరత్తులు చేస్తుంది. 3D లేకుండా 2D వెర్షన్ లో చూసినప్పుడు థియేటర్స్ లో ఆడియన్స్ కి రోమాలు నిక్కపొడుచుకున్నాయి. అలాంటిది 3D వెర్షన్ లో చూస్తే ఇక ఏమైపోతారో అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని షాట్స్ ని 3D లోకి మార్చి హైదరాబాద్ లోని ఒక పాపులర్ మల్టీప్లెక్స్ లో కూర్చొని మూవీ టీం చూశారట. ఔట్పుట్ అద్భుతంగా వచ్చిందని, ఇప్పుడు సినిమా మొత్తాన్ని 3D లోకి మార్చే ప్రక్రియ ని మొదలుపెట్టబోతున్నామని ఈ సందర్భంగా మూవీ టీం చెప్పుకొచ్చింది. అయితే ఈ ప్రక్రియ కి చాలా సమయం పట్టే అవకాశం ఉందట.
ఎందుకంటే మేకర్స్ ప్రేక్షకులకు ఇప్పటి వరకు కలగని 3D ఎఫెక్ట్స్ అనుభూతిని కలిగించే ప్రయత్నం చేయబోతున్నారట. ఆ రేంజ్ క్వాలిటీ తో ప్రాసెస్ ని మొదలు పెట్టారట. కాబట్టి ఈ సినిమా 3D వెర్షన్ సమ్మర్ లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. రీ రిలీజ్ చిత్రాలు దుమ్ములేపుతున్న ఈ రోజుల్లో, కచ్చితంగా ‘హనుమాన్’ 3D వెర్షన్ కి కూడా మంచి వసూళ్లు వస్తాయని ట్రేడ్ భావిస్తుంది.