Hanuma : ఎక్కడెక్కడ రామ నామం ఉంటుందో అక్కడక్కడ హనుమ కొలువై ఉంటాడు. ఇది సదా తెలిసిన విషయమే హనుమను చిరంజీవి అని రాముడు దీవించాడు కాబట్టి ఇప్పటికీ హనుమ హిమాలయాల్లో రామనామం జపిస్తూ సాధు సంతులకు కనిపిస్తుంటాడని విశ్వాసం. హనుమ అంటేనే శక్తి, యుక్తిని నిదర్శనం. కానీ ఆయన మాత్రం రామ నామానికి బద్ధుడు. శ్రీరామ నామ శక్తే తన వాయు వేగానికి, కార్యదీక్షను నడిపిస్తుందని అంటాడు హనుమ.
చాలా చోట్ల రామ నామం జపం చేసే సమయంలో అక్కడికి కోతి రూపంలో హనుమంతుడు వస్తుంటాడని చూస్తూనే ఉన్నాం. ఇక అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న వేళ పాత వీడియోలను సోషల్ మీడియాలో బయటకు తీసుకు వస్తున్నారు కొందరు. ఇందులో భాగంగా గతంలో ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ వీడియోను చూసిన వారంతా ‘జై హనుమాన్.. జై శ్రీరాం’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇంటి ఇల్లాలు ప్రత్యేక సందర్భంలో పూజలో కూర్చొని రామ నామం జపిస్తుంది. అక్కడకి వచ్చిన హనుమాన్ (కోతి) పరిశరాలను పరిశీలించి ఆ ఇల్లాలు ఒడిలో కూర్చొని ఆమెను కౌగిలించుకుంది. ఆమె మాత్రం రామనామ జపం చేస్తూనే ఉంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రామ నామానికి పశు పక్షాదులతో పాటు ప్రకృతి కూడా పులకరిస్తుందని అందరికీ తెలిసిందే. నిత్యం రామ నామం జపం చేసే ఇంట్లో కష్టాలు తొలగిపోతాయని పెద్దలు చెప్తుంటారు. రామ నామానికి అంత శక్తి ఉంటుంది మరి.