Calcutta High Court : వైద్యురాలి హత్యాచారం కేసు సీబీఐకి అప్పగించండి.. కలకత్తా హైకోర్టు ఆదేశం

Calcutta High Court

Calcutta High Court

Calcutta High Court : కోల్ కతాలోని వైద్య కళాశాల ఆస్పత్రి జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించాలని పోలీసులు ఆదేశించింది. వైద్యురాలి హత్యాచారం ఘటనపై దేశవ్యాప్తంగా డాక్టర్లు నిరసన తెలుపుతున్నారు. ఈ సమయంలో కలకత్తా హైకోర్టు ఈ కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని పోలీసులను ఆదేశించింది. కేసుకు సంబంధించిన అన్ని ఫైళ్లను బుధవారం ఉదయం 10 గంటలలోపు సీబీఐకి అందజేయాలని పేర్కొంది.  సెమినార్ హాల్ లో వైద్యురాలిపై అత్యంత పాశవిక దాడి జరుగుతుంటే ఆస్పత్రిలో ఉన్నవారికి ఆ విషయం తెలికపోవడం, యాజమాన్యం ఆలస్యంగా స్పందించడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ కేసులో నిందితుడికి పోలీసులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సాక్ష్యాలు తారుమారు చేయకుండా ఉండేందుకు స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని బాధితురాలి తల్లిదండ్రులు కోరినట్లుగా న్యాయస్థానం పేర్కొంది. గతంలో  ఓ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా న్యాయపరమైన దర్యాప్తు కోసం కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు వెల్లడించింది.

TAGS