JAISW News Telugu

Israel Defense : హమాస్ మిలిటరీ చీఫ్ మృతి.. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటన

Israel Defense : హమాస్ మిలిటరీ చీఫ్ మహ్మద్ డీఫ్ ను మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్ పై దాడుల సూత్రధారి ఇతనే అని వెల్లడించింది. జూలైలో ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో ఆయన మరణించినట్లు ఎక్స్ వేదికగా నిర్ధారించారు. జూలై 13న ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఫైటర్ జెట్లు ఖాన్ యునిస్ ప్రాంతంలో ఎయిర్ స్ట్రయికర్స్ చేశాయని తెలిపింది. ఇంటెలిజెన్స్ అంచనాల ప్రకారం ఆ దాడిలో మహ్మద్ చనిపోయాడని తేలింది.

అయితే, మహ్మద్ డీఫ్ హతమయ్యాడన్న వార్తల్ని హమాస్ కొట్టి పారేస్తోంది. ఈ దాడిలో 90 మందికి పైగా మృతి చెందారని, కాని వారిలో మహ్మద్ డీఫ్ లేరని స్పష్టం చేసింది. డీఫ్ ఉన్న ఇంటిపైనే బాంబులతో దాడిచేసి చంపినట్లు ఇజ్రాయెల్ చెబుతోంది.

పాలస్తీనా కోసం పోరాడుతున్న హమాస్ మిలిటెంట్ సంస్థ చీఫ్ ఇస్మాయిల్ హనియా కూడా మంగళవారం హత్యకు గురయ్యారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ లోని ఇంటిపై మంగళవారం జరిగిన దాడిలో అతడు చనిపోయినట్టు హమాస్ గ్రూప్ ధ్రువీకరించింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కూడా ఇస్మాయిల్ మరణాన్ని కన్ ఫర్మ్ చేసింది. ఈ దాడిలో ఇస్మాయిలో తో పాటు అతని బాడీగార్డ్ కూడా మృతి చెందినట్టు వెల్లడించింది.

Exit mobile version