UBlood : ‘యూ బ్లడ్’ సేవలకు ‘హాల్ ఆఫ్ ఫేమ్’ అవార్డ్స్

'Hall of Fame' Award for 'UBlood' services

‘Hall of Fame’ Award for ‘UBlood’ services

‘Hall of Fame’ Award for ‘UBlood’ Services : ప్రమాదాలు జరిగి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి, శస్త్ర చికిత్సలో రక్తం కావాల్సిన వారికి అండగా ఉంటోంది ‘యూ బ్లడ్’ యాప్. యూబ్లడ్ ఫౌండర్ జై, డాక్టర్ జగదీష్ బాబు యలమంచిలి గారి ఆలోచనలతో పురుడు పోసుకున్న ఈ యాప్ ఎంతో మంది ప్రాణాలను కాపాడుతోంది. మరెందరినో చావు నుంచి రక్షించి బతుకునిచ్చింది. ఎక్కడెక్కడ, ఎవరెవరికి రక్తం అవసరం అవుతుందో వారి వారికి సరైన సమయంలో దాతను వారి దరికి చేరుస్తుంది. నేరుగా నియర్ బై డోనార్ ను సదరు హాస్పిటల్ కు పంపుతుంది. దీంతో లైవ్ బ్లడ్ అందుబాటులో ఉంటుంది. ఈ యాప్ సేవలతో గ్రహీతలతో పాటు వైద్యులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

యూ బ్లడ్ యాప్ సేవలకు గాను ‘హాల్ ఆఫ్ ఫేమ్‘ అవార్డ్ సొంతం చేసుకుంది. ఈ అవార్డును నిర్వాహకులు 2024, ఏప్రిల్ 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు కింగ్స్‌వే పార్క్‌లో అందజేయనున్నారు. బీఆక్టివ్ , అర్మోస్టన్ లో అవార్డ్ ప్రధానోత్సవం ఉంటుంది. గ్రాండ్ మాస్టర్ ఎం జయంత్ రెడ్డి చేతుల మీదుగా యూ బ్లడ్ యాప్ నిర్వాహకులు ఈ అత్యున్నతమైన అవార్డును అందుకోనున్నారు. సుమన్ పిల్లే, హరీష్ కుమార్ అప్పరాల ఆధ్వర్యంలో ప్రధానోత్సవం ఉంటుంది.

యూ బ్లడ్ కు ఈ అవార్డు దక్కడంపై దాతలు, గ్రహీతలు, యాప్ నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విలువైన ప్రాణాలు కాపాడుతున్న ఈ యాప్ కు ఇలాంటి అవార్డులు మరెన్నో దక్కాలని కోరుకుంటున్నారు. 

TAGS