Future Jobs : ఉద్యోగాల భవిష్యత్ పై హాఫ్ మన్ రీడ్ సరికొత్త అంచనా
Future Jobs
Future Jobs : ఏళ్లు గడుస్తున్నకొద్దీ చేసే ఉద్యోగాల తీరు, పని విధానాల్లోనూ ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొవిడ్ సంక్షోభం తర్వాత కంపెనీలు కూడా తమ పంథాను మార్చుకున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి మొదలు ఎన్నో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎక్కువగా ఆన్ లైన్ వర్క్ కే ప్రాధాన్యం పెరిగింది. తాజాగా ఆర్టిఫిసియ్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి రావడంతో భవిష్యత్తులో మరిన్ని మార్పులు రావడం తథ్యం అంటున్నా విశ్లేషకులు.
ప్రస్తుత తరుణలో సోషల్ మీడియా ప్లాట్ ఫాం లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఏ తరహా ఉద్యోగాలు ఉండబోతున్నాయో చెప్పి సోషల్ మీడియాలో మరో కొత్త చర్చకు తెర తీశారు.
టెక్ రంగంలో ఎంతో అనుభవం ఉన్న హాఫ్మన్ గతంలో వేసిన పలు అంచనాలు నిజమయ్యాయి కూడా. సోషల్ మీడియాకు విపరీతమైన ఆదరణ వస్తుందని ఆయన ఎప్పుడో గుర్తించారు. అలాగే గిగ్ ఎకానమీ కూడా కొత్త పుంతలు తొక్కతుందని చాలా ఏళ్ల క్రితమే అంచనా వేశారు. ఆర్టిఫిషియల్ విప్లవం వస్తుందని ఆయన 1997లోనే చెప్పారు. ప్రస్తుతం ఉన్న 9-5 ఉద్యోగాలు కూడా కనుమరుగవుతాయని చెప్పారు. రాబోయే రోజుల్లో ఉద్యోగులు ఒకే దగ్గర, ఒకే పనిని చేయబోరని కూడా చెప్పారు. ఒకే సమయంలో వివిధ కంపెనీలకు పలు పనులు చేసే రోజులు రానున్నాయని వెల్లడించారు.
2034 వరకు ఇప్పుడున్న సంప్రదాయ ఉద్యోగాలు ఇక ఉండవని చెప్పారు. కొత్త అవకాశాలతో పాటు ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. స్థిరమైన ఉద్యోగాలు లేకపోవడం, నిపుణులు దీర్ఘకాలంలో ఒకేచోట పనిచేయడానికి ఇష్టపడకపోవడంతో సమస్యలు ఎదురవుతాయన్నారు. అదే సమయంలో ఒక వ్యక్తి ఒక కంపెనీకే కాకుండా తన నైపుణ్యాలు, ప్రతిభకు అనుగుణంగా వివిధ రంగాల్లో పని చేసే అవకాశం ఉంటుందన్నారు. దీనివల్ల కంపెనీల ఉత్పాదకత కూడా పెరుగుతుందని చెప్పారు. రాబోయే రోజుల్లో ఆతిథ్యరంగం తో పాటు అన్ని సెక్టార్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భాగమవుతుందన్నారు.