Raj Tarun : ట్విస్టుల మీద ట్విస్టులతో రాజ్ తరుణ్, లావణ్య ల పరస్పర ఫిర్యాదులు సాగుతున్నాయి. ఈ క్రమంలో లావణ్య రాజ్ తరుణ్ పై మరోసారి ఫిర్యాదు చేశారు. అయితే ఈసారి మరో సంచలన ఆరోపణలు చేశారు. రాజ్ తరుణ్ తనకు అబార్షన్ చేయించాడని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
హీరో రాజ్ తరుణ్ మాజీ లవర్ లావణ్య మరోసారి పోలీసులను ఆశ్రయించింది. తన మాజీ ప్రియుడితో పాటు హీరోయిన్ మాల్వీ మల్హోత్రాపై మరోసారి కేసు పెట్టింది. తనతో పాటు తన తమ్ముడిని లావణ్య బెదిరిస్తున్నదని మాల్వీ బుధవారం ఉదయం పోలీసులకు కంప్లయింట్ చేశారు. ఈ క్రమంలో లావణ్య మరోసారి కేసు పెట్టారు. దీనితో పాటు స్క్రీన్ షాట్స్, మరికొన్ని ఆధారాలను ఫిర్యాదుతో పాటు అందజేశారు. ఈ క్రమంలోనే మరోసారి రాజ్ తరుణ్‌తో తన బంధం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
పదేళ్లుగా తామిద్దరం కాపురం చేస్తున్నామని చెప్పిన లావణ్య.. కొన్నాళ్ల క్రితం రాజ్ తరుణ్ తనకు అబార్షన్ చేయించాడని చెప్పి షాక్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన మెడికల్ ఆధారాలు, ఇతర వివరాలు అందజేసింది. అయితే తన పేరు లావణ్య అని కాకుండా అన్విక పేరుతో తామిద్దరం సహజీవనం చేశామని చెప్పుకొచ్చింది. ఇదే పేరుతో విదేశాలకు కూడా వెళ్లామని వెల్లడించింది. అయితే మాల్వీ వచ్చిన తర్వాత రాజ్ తరుణ్ తనను దూరం పెడుతున్నడని ఆవేదన వ్యక్తం చేసింది. మొన్నటి వరు తనను మోసం చేశాడని ఆరోపణలు చేసిన లావణ్య ఇప్పుడు అబార్షన్ చేయించాడని చెప్పడం ఈ కేసు మరో మలుపు తిరిగింది. అయితే ముందుగానే ఈ విషయం ఎందుకు చెప్పలేదని పలువురు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సిందే.