H1B visa : ఇక మీదట హెచ్ 1బీ వీసా రెన్యువల్ అమెరికాలోనే?
H1B visa : ఇక మీదట హెచ్ 1బీ వీసా పునరుద్ధరణ మరింత సరళీకరించేందుకు అమెరికా నిర్ణయించింది. దీంతో రాబోయే రోజుల్లో వీసా పునరుద్ధరణ దేశీయంగానే చేపట్టనుంది. దీనికి గాను చర్యలు తీసుకుంటోంది. దీనికి పైలెట్ ప్రోగ్రామ్ ను డిసెంబర్ లో ప్రారంభించేందుకు సంకల్పించింది. మూడు నెలల పాటు ఇది అందుబాటులో ఉంటుంది. మొదట 20 వేల మందికి ఇందులో స్థానం కల్పించనున్నారు.
భారతీయ ప్రయాణికులకు వీలైనంత త్వరగా వీసా అపాయింట్ మెంట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు అమెరికా చెబుతోంది. డిసెంబర్ నుంచి మూడు నెలల పాటు అమెరికాలో ఉంటున్న హెచ్1 బీ వీసాదారులకు వారి స్వదేశాలకు వెళ్లకుండానే రెన్యువల్ చేసుకోవచ్చు. పైలెట్ ప్రోగ్రామ్ కింద 20 వేల మందికి వీసాలను పునరుద్ధరించేందు నిర్ణయం తీసుకుంటున్నారు.
ఈ ప్రోగ్రామ్ తో భారతీయులే ఎక్కువ లాభం పొందుతారు. భారతీయులు వీసా అపాయింట్ మెంట్ కోసం వారి దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అమెరికాలోనే ఆ పని కానివ్వడంతో సమయం కలిసొస్తుంది. త్వరలోనే దీనిపై అధికారిక నోటీసులు జారీ చేసేందుకు రెడీ అయింది. ప్రస్తుతం ఈ ప్రోగ్రామ్ హెచ్1బీ కేటగిరీ వర్క్ వీసాలకు మాత్రమే అందుబాటులోకి తీసుకోనుంది.
ఈ సదుపాయంతో భారతీయులకు సమయంతో పాటు డబ్బులు కూడా ఆదా కానున్నట్లు తెలుస్తోంది. అమెరికా తీసుకున్న నిర్ణయంతో చాలా మంది భారతీయులకు ఎంతో మేలు కలగనుంది. ఈనేపథ్యంలో ఈ ప్రాజెక్టు మంచి ఫలితాలు ఇస్తే ఇకమీదట దాన్ని అమలు చేసేందుకు ముమ్మరంగా చర్యలు తీసుకోనుందని చెబుతున్నారు.