JAISW News Telugu

H-1B 2025 : 50శాతం తగ్గిన అప్లికేషన్ కౌంట్..!

H-1B 2025

H-1B 2025

H-1B 2025 Registrations : హెచ్1బీ 2025 ఆర్థిక సంవత్సరానికి గానూ రిజిస్ట్రేషన్ ను 2024, మార్చి 6న ప్రారంభమవుతుంది. అయితే గతంలో లబ్ధిదారు కేంద్రీకృత విధానంతో U.S. Citizenship & Immigration Services (USCIS)కు 7,58,994 రిజిస్ట్రేషన్లు రాగా, అందులో 408,891 డూప్లికేట్లు ఉన్నాయి. ఈ ఏడాది సుమారు 3,50,000 మంది హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకుంటారని అంచనా. ఈ సంఖ్య గతేడాదిలో వచ్చిన వాటిలో సగం కంటే తక్కువ.

గతంలో వచ్చిన అనేక దరఖాస్తులను పరిశీలించి లాటరీ పద్ధతిలో ఎంపిక చేసేవారు. కొత్త హెచ్-1బీ లాటరీ విధానంలో ప్రత్యేక లబ్ధిదారుడు సమాన అవకాశాలు పొందుతారు. ఇందులో ఎంపికైన లబ్ధిదారులు తాము పని చేసే యజమాని, కంపెనీని వారే చూజ్ చేసుకోవచ్చు. అయితే, దీంతో కొన్ని కంపెనీలు, యజమానులకు ఇబ్బంది ఎదురవుతుంది. వీసా పిటిషన్లకు USCIS ఫీజుల పెంపు వారి ఆందోళనలను మరింత పెంచింది. రిజిస్టర్డ్ లబ్ధిదారులు ఎంపికైన తర్వాత తమలో చేరేలా యజమానులు చూసుకోవాలి. రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లుబాటయ్యే ప్రయాణ పత్రాల అవసరాన్ని USCIS స్పష్టంగా వివరిస్తుంది.

2025 ఆర్థిక సంవత్సరంలో, కొన్ని ఐటీ కంపెనీల మోసాలను నిరోధించే లక్ష్యంతో ప్రతి లబ్ధిదారునికి ఒక హెచ్-1బీ దరఖాస్తు మాత్రమే అనుమతిస్తారు. దీంతో హెచ్-1బీ కోసం దరఖాస్తు చేసుకునే ఎంఎస్ విద్యార్థులకు నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది. గతేడాది USCIS చిన్న కంపెనీలు మోసాన్ని గుర్తించాయి, నిస్సిగ్గుగా ప్రతీ వ్యక్తికి బహుళ దరఖాస్తులను సమర్పించాయి. లాటరీ వ్యవస్థను దుర్వినియోగం చేసే 20 దరఖాస్తులకు కూడా విస్తరించాయి.

ఈ విధానంతో ఉద్యోగులు యజమానులను స్వేచ్ఛగా ఎంచుకోవచ్చు. ఇదే సమయంలో యజమానులు ఎక్కువ రిజిస్ట్రేషన్లను చేసుకోలేరు. బహుళ ఉద్యోగ ఆఫర్లు పొందడం కంటే ఉద్యోగం సంపాదించి హెచ్ 1బీ వీసా అడగడం మంచిది.

Exit mobile version