Gyanvapi Case:జ్ఞానవాపి కేసులో ముస్లీం పక్షాలకు ఎదురుదెబ్బ
Gyanvapi Case:వారణాసిలోని జ్ఞానవాపి మసీదు, కాశీ విశ్వనాథ్ టెంపుల్‌పై దాఖలైన పిటీషన్‌కు సంబంధించి ముస్లీం సంఘాలకు తాజాగా చుక్కెదురైంది. సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్, అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ వేసిన పిటీషన్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. ఈ మేకు మంగళవారం అలహాబాద్ హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఇక ఆలయాన్ని పునరుద్దరించాలని కోరుతున్న సివిల్ పిటీషన్లకు హైకోర్టు అనుమతిస్తున్నట్లు పేర్కొంది.
మొఘల్ కాలంలో హిందూ దేవాలయ స్థానంలో జ్ఞానవాపి మసీదు నిర్మించారని ఈ విషయాన్ని సర్వే చేసి తేల్చాలని కోరుతూ నలుగురు హిందూ మహిళలు పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వాటిపై విచారణ జరిపిన వారణాసి కోర్టు..మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీల్ చేసిన వజూఖానా ప్రాంతాన్ని మినహాయించి మసీదు ప్రాంగణం మొత్తం కార్బన్ డేటింగ్, ఇతర విధానాల ద్వారా శాస్త్రీయ సర్వే నిర్వహించాలని భారత పురావస్తు విభాగాన్ని ఆదేశించింది.
మసీదు ప్రాంగణంలో ఆలయాన్ని పునరుద్దరించాలంటూ దాఖలు చేసిన పిటీషన్లను ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు, అంజుమన్ ఇంతేజామియా కమిటీ అలహాబాద్ హైకోర్టులో సవా్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా తీర్పు వెల్లడికావడం ఆసక్తికరంగా మారింది.