Gunturukaaram : వాటితో పోలిస్తే ‘గుంటూరుకారమే’ పక్కా కమర్షియల్.. నిర్మాత నాగవంశీ సంచలన వ్యాఖ్యలు

 

Gunturukaaram

Gunturukaaram

Gunturukaaram : ప్రిన్స్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘గుంటూరు కారం’ మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. మూవీ యూనిట్ కలెక్షన్లలో రికార్డులు కొల్లగొడుతుందంటూ ప్రకటిస్తున్నా..ఈ మూవీపై ఫ్యాన్స్ మాత్రం నిరాశలోనే ఉన్నారు. తాము ఊహించినంత లెవల్ లో లేదని, త్రివిక్రమ్ రోటిన్ సినిమా ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ మూవీపై ట్రోలర్స్ ఓ రేంజ్ లో ఆడుకున్న విషయం తెలిసిందే. అయితే వీటన్నంటిపై నిర్మాత నాగవంశీ తాజాగా క్లారిటీ ఇచ్చారు. అతడు, ఖలేజా, గుంటూరు కారం సినిమాల మధ్య తేడాను చెప్పుకొచ్చారు.

ఈ మూడు సినిమాలు మహేశ్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చాయని.. ముందు వచ్చిన రెండు సినిమాలు ఒకేలాగా ఉండడం.. ఆ రెండూ బ్లాక్ బస్టర్లు కావడంతో గుంటూరు కారంపై పెద్ద ఎత్తున అంచనాలు క్రియేట్ అయ్యాయి. కేవలం అంచనాలే కాదని అతడు రేంజ్ లో ఉంటుందని అంతా భావించారు. వాళ్లు ఊహించినట్లు సినిమా లేకపోయేసరికి కామెంట్స్ చేస్తున్నారని అన్నారు.

వాస్తవానికి ఆ సినిమాలకు మించి ఉందని.. ఇందులో అన్ని రకాల ఎమోషన్లు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా మూడు సినిమాల మధ్య తేడాను ఆయన వివరించే ప్రయత్నం చేశారు. 2005లో మహేశ్ బాబుతో తీసిన అతడు, ఆ తర్వాత 2010లో వచ్చిన ఖలేజా కల్ట్ మూవీ అని వివరించారు. కానీ గుంటూరు కారం సినిమా మాత్రం పక్కా కమర్షియల్ మూవీ అని నిర్మాత నాగవంశీ వెల్లడించారు. సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేస్తున్నాం కాబట్టి కమర్షియల్ సినిమాతో వచ్చామని మరోసారి క్లారిటీ ఇచ్చారు.

ఇదిలా ఉండగా.. మహేశ్ హీరోగా వచ్చిన గుంటూరు కారం మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు.  సంక్రాంతి సందర్భంగా ఈనెల 12న రిలీజైన ఈ మూవీ తొలి ఆట నుంచే మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. అయితే కలెక్షన్లు మాత్రం బాగానే వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వారం రోజుల్లో రూ.212 కోట్లు వసూలు చేసింది.

TAGS