Gunturkaram Pre Release Event : గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ వేడుక ఆగిపోవడానికి కారణాలు ఇవే! మరీ ఇంత రాజకీయమా?
Gunturkaram Pre Release Event : అభిమానులు మరియు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘గుంటూరు కారం’ చిత్రం మరో ఆరు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. షూటింగ్ ప్రారంభ దశ నుండే భారీ అంచనాలను నెలకొల్పిన ఈ సినిమా, రోజులు గడిచే కొద్దీ ఆసక్తికరమైన ప్రమోషనల్ కంటెంట్ తో క్రేజ్ ని పెంచుకుంటూ వెళ్ళింది. రీసెంట్ గా విడుదల చేసిన ‘కుర్చీ మడతపెట్టి’ అనే సాంగ్ ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో మనమంతా చూస్తూనే ఉన్నాం.
మాస్ సెంటర్స్ లో ఈ పాటకి థియేటర్స్ దద్దరిల్లిపోవడం ఖాయం. నిన్ననే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి, సెన్సార్ సభ్యులు UA సర్టిఫికేట్ ని జారీ చేసారు. మాస్ ఆడియన్స్ తో పాటుగా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యే విధంగా, చక్కటి ఎమోషన్ ఈ చిత్రం లో ఉందని, సంక్రాంతికి ఇలాంటి విందు భోజనం లాంటి సినిమా వచ్చి చాలా కాలం అయ్యిందని సెన్సార్ సభ్యులు మెచ్చుకున్నారట.
ఇకపోతే ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నేడు హైదరాబాద్ లోని శిల్పకళావేదిక లో ఘనంగా జరపాలని అనుకున్నారు. అమెరికా లో అయితే పలు థియేటర్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాట్లు కూడా చేసారు. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ప్రీ రిలీజ్ ఈవెంట్ ని క్యాన్సిల్ చేస్తున్నామని, వేరే డేట్ లో నిర్వహిస్తామని, అసౌకర్యానికి చింతిస్తున్నాము అంటూ నిన్న ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టింది మూవీ టీం. ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే ట్రైలర్ ని విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు. అంటే ట్రైలర్ కూడా ఈరోజు లేదు అన్నమాట. దీనిపై అభిమానులు చాలా తీవ్రమైన అసహనం ని వ్యక్తం చేసారు.
పోలీస్ పర్మిషన్ లేకపోవడం వల్లే ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని రద్దు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. భారీ ఎత్తున అభిమానులు హాజరు అవుతారనే సమాచారం ఉండడంతో, దానికి శిల్ప కళా వేదిక సరైనది కాదని, వేరే లొకేషన్ కి మార్చుకొని అనుమతిని కోరండి అంటూ గుంటూరు కారం టీం కి పోలీసులు విజ్ఞప్తి చేశారట. అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్ ని రద్దు చేసినట్టు టాక్ వినిపిస్తుంది. శిల్ప కళా వేదిక లో ఇది వరకు ఎన్నో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ జరిగాయి, ఏ ఈవెంట్ కి రానటువంటి సెక్యూరిటీ ఇబ్బంది మహేష్ సినిమాకే ఎందుకు వస్తుంది?, కచ్చితంగా ఇందులో ఎదో కుట్ర రాజకీయం ఉంది అంటూ సోషల్ మీడియా లో ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.