Gunturkaaram : మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన మూడో చిత్రం గుంటూరు కారం. ఇదివరకే వారిద్దరి కలయికలో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాల్లో పంచులు సరిగా పడ్డాయి. దీంతో వాటికి ప్రేక్షకులు జై కొట్టారు. ఇప్పుడు గుంటూరు కారం జనవరి 12న విడుదలైన సంచలనంగా దూసుకుపోతోంది.
గత చిత్రాలకు భిన్నంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సినిమా పరిశ్రమలో ఏ హీరోకు రాని ఇమేజ్ మహేష్ కు వచ్చింది. తాను నటిస్తే సినిమా బాక్సాఫీసు రికార్డులు తిరగ రాయాల్సిందే. అదే కోణంలో గుంటూరు కారం కూడా నిలుస్తోంది. కలెక్షన్ల పరంగా అదరగొడుతోంది. గత చిత్రాలకు ఏ మాత్రం తీసిపోకుండా ప్రేక్షకుల అంచనాలకు తగినట్లుగా నిలుస్తోంది.
మొదట్లో నెగెటివ్ టాక్ వచ్చినా తరువాత పుంజుకుంది. ప్రస్తుతం సినిమాకు వస్తున్న కలెక్షన్లు సినిమా స్థాయిని తెలియజేస్తున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్టుతో గుంటూరు కారం తనదైన మార్కు చూపిస్తోంది. మహేష్ బాబు గత చిత్రాల సరసన చేరుతోంది. ఆల్ టైం రికార్డులతో ముందుకు వెళ్తోంది. తొలి రోజే రూ.94 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.
ప్రపంచ వ్యాప్తంగా రూ.200 కోట్ల గ్రాస్ కు చేరుకుంది. టాలీవుడ్ లో రూ.100 కోట్లకు పైగా రాబట్టిన సినిమాగా సంచలనం కలిగించింది. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాటల సరసన గుంటూరు కారం చేరింది. ఇలా మహేష్ బాబు స్టామీనాతో గుంటూరు కారం రోజురోజుకు సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తుందని పరిశ్రమ టాక్.