- మంత్రి రజనీ పై అవినీతి ఆరోపణలు?
Guntur YSRCP : వైఎస్ఆర్సిపిలో ముసలం మొద లైంది. కొద్ది కాలం క్రితం వరకు కలిసి,మెలసి ఉన్న వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, చిలక లూరి పేట వైసీపీ ఇంఛార్జి మల్లెల రాజేష్ నాయు డు ల మధ్య వైరం ఈ మధ్య బయటపడింది. అక్కా,తమ్ముడు మల్లె సాగిన వారి బంధం తెగి పోయింది.వారి మధ్య రాజకీయ యుద్దం ప్రారంభం అయ్యింది.
ఇది ఎక్కడి దాకా వెళ్తుందో,ఎన్ని మలుపులు తిరు గుతుందో అన్న చర్చ జిల్లా రాజకీయ వర్గాల్లో జరు గుతోంది. మంత్రి రజని తనవద్ద6.5 కోట్ల రూపా యల తీసుకున్నట్టు మల్లెల రాజేష్ నాయుడు ఆరోపించారు.ఆయన మంగళవారం మధ్యాహ్నం పేట లో మీడియా వారి తో మాట్లాడుతూ రజని పై విరుచుకు పడ్డారు.
దీంతో కోట్ల రూపాయల ముడుపులు వ్యవహారం ఇప్పుడు మంత్రి విడుదల రజని ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఈ ఊబీ లోకి వైఎస్సార్ కాంగ్రెస్ లో నెం బర్ టూ గా చెలామణి అవుతున్న సజ్జల రామకృ ష్ణ రెడ్డి నీ లాగడం విశేషం. తన దగ్గర ఆరున్నర కోట్లు తీసుకొన్న మంత్రి రజనీ సజ్జల ప్రమేయం చేసుకొన్న తర్వాత కూడా మూడు కోట్లే తిరిగి ఇచ్చారని మల్లెల రాజేష్ నాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు.
రజని మాటలు నమ్మి పార్టీ అధిష్టానం తన స్థానం లో గుంటూరు నాయకుడ్ని చిలకలూరిపేట టికెట్ కట్ట బెట్టెందుకు సిద్దం అయ్యే పరిస్తితి కనపడు తుందని రాజేష్ నాయుడు మండిపడ్డారు. ఇందాక నేను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి సమక్షం లో డబ్బు అడిగాను,ఆ అమ్మాయి ఇవ్వలే దు లే పొమ్మన్నాడు,అంటూ వివరించారు.
నాకు రజని 6.5.కోట్లు ఇవ్వాలనాటనికి కి సాఖ్యం మా వైస్ చైర్మన్ రాధా అంటూ మీడియా వారికి ఆయన ను చూయించారు. ఆ సమయం లో సజ్జ ల ను తొలగిస్తే పార్టీ కి పట్టిన శని వదులు తుంది అని వైసీపీ కార్యకర్తలు కేకలు వేశారు.
మర్రి కి ఇవ్వండి 20 కోట్లు ఖర్చు పెడతా.. నన్ను కాదనుకుంటే పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడ్డ మారి రాజశేఖర్ కు టికెట్ ఇవ్వండి,నేను 20 కోట్లు ఖర్చు పెడతానని వైసీపీ అధిష్టానానికి కి రాజేష్ విజ్ఞప్తి చేశారు.సొంత పార్టీ వారి మీద కేసులు, వేదింపులు ఏంటని ఆయన ప్రశ్నించారు.
మంత్రి రజని పదవి కాలం లో చిలకలూరిపేట లో సొంత పార్టీ వారిపై అక్రమ కేసులు,వేదింపులు జరిగాయని ఆరోపించారు. తెలుగుదేశం వారి గురించి ఒక్క కేసు లేదన్నారు. ఈ సమావేశం లో నియోజకవర్గ వై సి పి పరిశీలకుడు చిట్టా విజయ భాస్కర్ రెడ్డి కూడా ఉండటం విశేషం.