JAISW News Telugu

Guntur Kaaram : ‘గుంటూరు కారం’ క్లోసింగ్ కలెక్షన్స్..ఫ్లాప్ టాక్ తో ఇన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యిందా!

'Guntur Karam' closing collections

‘Guntur Kaaram’ closing collections

Guntur Kaaram : గత కొంతకాలం నుండి ఫ్లాప్ అనే పదానికి దూరంగా ఉంటూ వస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు కి మరో సారి ఫ్లాప్ అంటే ఎలా ఉంటుందో రుచి చూపించిన చిత్రం ‘గుంటూరు కారం’.రీసెంట్ గానే సంక్రాంతి కానుకగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో జనవరి 12 వ తారీఖున విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి ఆట నుండే అంచనాలను అందుకోవడం లో విఫలం అయ్యింది.

దీని ప్రభావం కలెక్షన్స్ పై చాలా బలంగా పడింది. సంక్రాంతి పండుగ సెలవుల కారణంగా కోస్తాంధ్ర ప్రాంతం మొత్తం పర్వాలేదు అనే రేంజ్ లో వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, నైజాం, ఓవర్సీస్, కర్ణాటక వంటి ప్రాంతాలలో మాత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి ఈ సినిమాకి దాదాపుగా 140 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇది మహేష్ కెరీర్ లో హైయెస్ట్ అని చెప్పొచ్చు.

అంత బిజినెస్ జరిగిన ఈ సినిమాకి కేవలం రెండు వారాల్లోపే బిజినెస్ మొత్తం క్లోజ్ అయిపోవడం గమనార్హం. సోమవారం నుండి ఈ చిత్రానికి అన్నీ ప్రాంతాలలో షేర్ వసూళ్లు రావడం ఆగిపోయాయి. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఫుల్ రన్ లో 92 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. నైజాం ప్రాంతం లో ఈ సినిమాకి విడుదలకు ముందు 45 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరగగా, ఫుల్ రన్ లో కేవలం 24 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టింది అట. అంటే దాదాపుగా 21 కోట్ల రూపాయిలు నష్టం వాటిల్లింది అన్నమాట. దిల్ రాజు నైజంలో తన డిస్ట్రిబ్యూషన్ చరిత్ర లో ఇప్పటి వరకు ఇంత నష్టాన్ని ఎప్పుడూ చూడలేదని టాక్.

సీడెడ్ లో కూడా ఇదే పరిస్థితి. దాదాపుగా 13 కోట్ల రూపాయలకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ చిత్రానికి , ఫుల్ రన్ లో కనీసం 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టింది అట. మిగిలిన ప్రాంతాలలో కూడా ఇదే పరిస్థితి. మహేష్ కి కంచుకోట అని పిలవబడే ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రానికి నాలుగు మిలియన్ డాలర్ల నష్టం వచ్చిందంటే, ఏ రేంజ్  డిజాస్టర్ ఫ్లాప్ అనేది అర్థం చేసుకోవచ్చు. కానీ ఆంధ్ర లో మాత్రం కోస్తాంధ్ర ప్రాంతం లో కొన్ని సెంటర్స్ బ్రేక్ ఈవెన్ అయ్యాయని అంటున్నారు ట్రేడ్ పండితులు.

Exit mobile version