Guntur Kaaram : ‘గుంటూరు కారం’ 10 రోజుల వసూళ్లు..ఇక రన్ పూర్తిగా ముగిసినట్టే!
Guntur Kaaram : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘గుంటూరు కారం’ చిత్రం విడుదలై నేటికీ 10 రోజులు పూర్తి అయ్యింది. ఈ పది రోజులకు గాను ఈ సినిమా ఎంత వసూళ్లు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూస్తే, కోస్తాంధ్ర మొత్తం దాదాపుగా బ్రేక్ ఈవెన్ మార్కుకి దగ్గరగా వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే కోస్తాంధ్ర లో సంక్రాంతి సెలవులు వచ్చినప్పుడు సినిమాలకు అద్భుతమైన వసూళ్లు వస్తుంటాయి.
ఆ సంక్రాంతి వచ్చే జనాల వల్ల ఈ చిత్రం కోస్తాంధ్ర వరకు కాస్త సేఫ్ అయ్యిందనే చెప్పాలి. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి కోస్తాంధ్ర లో 40 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక మిగిలిన అన్నీ ప్రాంతాలలో డిజాస్టర్ ఫ్లాప్ అనే పదం చాలా చిన్నది అనే చెప్పాలి. ముఖ్యంగా సీడెడ్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 15 కోట్ల రూపాయలకు జరిగింది.
10 రోజులకు కలిపి ఈ ప్రాంతం లో ఇప్పటి వరకు కేవలం 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. అంటే దాదాపుగా సగానికి పైగా నష్టాలను తెచ్చిపెట్టింది ఈ సినిమా. అంతే కాకుండా ఈ ప్రాంతం లో అప్పుడెప్పుడో వచ్చిన పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’, ‘కాటమరాయుడు’ వంటి ఫ్లాప్ సినిమాలకు వచ్చినంత షేర్ వసూళ్లు కూడా రాలేదని చెప్పాలి. ఇక నైజాం ప్రాంతం లో ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 42 కోట్ల రూపాయలకు జరిగింది. కానీ పది రోజులకు గాను ఈ చిత్రం ఇక్కడ కేవలం 23 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. అంటే ఇక్కడ కూడా దాదాపుగా 50 శాతం వరకు నష్టాలు వాటిల్లాయి అన్నమాట.
ఓవర్సీస్ ప్రాంతం లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 5 మిలియన్ డాలర్లు షేర్ వసూళ్లు రాబట్టాలి, కానీ ఇప్పటి వరకు గ్రాస్ వసూళ్లే 3 మిలియన్ డాలర్స్ లేవు. ఇలా చెప్పుకుంటూ పోతే కర్ణాటక,తమిళనాడు ఇలా అన్నీ ప్రాంతాలలో డిజాస్టర్ రేంజ్ వసూళ్లను రాబట్టింది. నిన్నటితో ఈ సినిమా ఫుల్ రన్ దాదాపుగా ముగిసినట్టే అని, ప్రపంచవ్యాప్తంగా ఈ పది రోజులకు గాను 92 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 40 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టాలి, అది దాదాపుగా అసాధ్యమే.