Guntur Karaam Collections : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన మూడవ చిత్రం ‘అజ్ఞాతవాసి’ 2018 వ సంవత్సరం లో విడుదలై ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక పీడకల. అలాంటి చెత్త సినిమా ఇచ్చినందుకు త్రివిక్రమ్ శ్రీనివాస్ ని ఇప్పటికీ తిడుతూనే ఉంటారు ఫ్యాన్స్. కానీ ఈ సినిమా కొన్ని ప్రాంతాలలో పెట్టిన ఓపెనింగ్స్ రికార్డ్స్ ని ఇప్పటి వరకు రాజమౌళి సినిమాలు మరియు ‘సలార్’ తప్ప ఏ చిత్రం కూడా దాటలేకపోయింది.
ఉదాహరణకి అమెరికా ప్రీమియర్ షోస్ లో ‘అజ్ఞాతవాసి’ చిత్రం దాదాపుగా 15 లక్షల డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా రికార్డు ని ఇప్పటి వరకు #RRR మరియు ‘సలార్’ మాత్రమే దాటాయి. మిగిలిన ఏ చిత్రం కూడా దరిదాపుల్లోకి వెళ్లలేకపోయింది. కానీ ఎప్పటికైనా ‘అజ్ఞాతవాసి’ రికార్డుని కొట్టేది మేమే అని మహేష్ బాబు ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకునే వాళ్ళు.
‘గుంటూరు కారం’ చిత్రం తో అజ్ఞాతవాసి రికార్డు ని కచ్చితంగా లేపేస్తాము అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి సోషల్ మీడియా లో సవాళ్లు విసిరారు. నేడు ‘గుంటూరు కారం’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ప్రీమియర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ నుండే 1 మిలియన్ గ్రాస్ ని సంపాదించుకున్న ఈ చిత్రం కచ్చితంగా అజ్ఞాతవాసి రికార్డుని కొడుతుందని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా అనుకున్నారు. కానీ కేవలం 14 లక్షల డాలర్లను మాత్రమే ఈ సినిమా ప్రీమియర్ షోస్ నుండి రాబట్టి కొద్దిగా లో మిస్ అయిపోయింది. కానీ ఓవరాల్ ఓవర్సీస్ లో మాత్రం అజ్ఞాతవాసినే ఇప్పటికీ లీడింగ్ లో ఉంది. ఇక గుంటూరు కారం కి ఫ్లాప్ టాక్ రావడం తో, ప్రీమియర్స్ తర్వాత మొదటి రోజుకి కలెక్షన్స్ బాగా డౌన్ అయ్యాయి.
ఈ సినిమాని ఓవర్సీస్ లో కూడా ‘హనుమాన్’ అధిగమించేసింది అంటే గుంటూరు కారం చిత్రానికి ఏ రేంజ్ నెగటివ్ టాక్ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా నార్త్ అమెరికా లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే దాదాపుగా 5 మిలియన్ డాలర్ వసూళ్లను రాబట్టి. కానీ ట్రెండ్ చూస్తూ ఉంటే మూడు మిలియన్ డాలర్ల లోపే క్లోసింగ్ అయ్యేట్టు ఉంది. ఇంత పెద్ద డిజాస్టర్ గా ఈ సినిమా నిలుస్తుందని ఎవ్వరూ అంచనా వెయ్యలేకపోయారు.