Guntur Kaaram : సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’ చిత్రం నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా సంక్రాంతి సెలవుల్లో ఆంధ్ర ప్రదేశ్ లో డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. కానీ ఆంధ్ర లో తప్ప మిగిలిన అన్నీ ప్రాంతాలలో కూడా ఈ సినిమాకి అనుకున్న స్థాయి వసూళ్లు అయితే రావడం లేదు. చూస్తుంటే టాక్ ప్రభావం చాలా బలంగా పడినట్టుగా తెలుస్తుంది.
140 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం ఫుల్ రన్ లో 90 కోట్ల రూపాయిల వసూళ్లను రాబట్టే ఛాన్స్ ఉంది. అంటే బయ్యర్స్ కి దాదాపుగా 50 కోట్ల రూపాయిల నష్టం వాటిల్లే అవకాశం ఉంది అన్నమాట. ‘అజ్ఞాతవాసి’ తర్వాత త్రివిక్రమ్ కెరీర్ లో భారీ డిజాస్టర్ ఫ్లాప్ గా ఈ సినిమాని పరిగణించొచ్చు. మహేష్ బాబు ఎనెర్జిటిక్ నటన ఈ సినిమాలో లెకపొయ్యుంటే, మరో అజ్ఞాతవాసి కచ్చితంగా అయ్యేదని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.
అయితే ఈ సినిమా సంక్రాంతికి ఒక మోస్తరు వసూళ్లను రాబట్టడానికి ప్రధాన కారణం ‘కుర్చీ మడతపెట్టి’ అనే పాట. సోషల్ మీడియా లో ఎప్పటి నుండో ట్రెండ్ అవుతున్న ‘కుర్చీ మడతపెట్టి’ అనే పదాన్ని ఉపయోగించుకొని థమన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ విడుదలైనప్పుడు అప్పట్లో థమన్ ని అందరూ తిట్టారు. మహేష్ లాంటి సూపర్ స్టార్ సినిమాలో ఇలాంటి పాటలు ఏందిరా అంటూ థమన్ ని, మూవీ మేకర్స్ ని ఫ్యాన్స్ తిట్టారు. కానీ ఇప్పుడు ఆ పాటనే సినిమాకి శ్రీ రామ రక్షగా మారింది. సెకండ్ హాఫ్ మొత్తం మీద అభిమానులు థియేటర్స్ లో లేచి గంతులు వేసే మూమెంట్ ని ఇచ్చిన ఏకైక సందర్భం ఇది. కేవలం ఈ పాట కోసం థియేటర్స్ కి వెళ్లిన వారి సంఖ్య పెద్దదే.
ఇప్పుడు ఈ పాట కి యూట్యూబ్ లో 50 లక్షల వ్యూస్ వచ్చాయి. యూట్యూబ్ షార్ట్స్, ఇంస్టాగ్రామ్ రీల్స్ ఎక్కడ చూసినా ఈ పాటకి డ్యాన్స్ పెర్ఫార్మన్స్ చేసి నెటిజెన్స్ అప్లోడ్ చేస్తున్నారు. అలా యూత్ మరియు మాస్ ఆడియన్స్ లో పాట బాగా ఎల్లిపోవడం వల్ల ఈ స్థాయి వ్యూస్ వచ్చాయని అంటున్నారు విశ్లేషకులు. రాబొయ్యే రోజుల్లో ఈ లిరికల్ వీడియో సాంగ్ 100 వ్యూస్ ని కూడా అందుకుంటుంది అని అంటున్నారు విశ్లేషకులు.