Guntur Kaaram : ‘గుంటూరు కారం’ థియేటర్లు హను-మాన్ కే!
Guntur Kaaram : అనుకున్నదే అయ్యిందేమో అనిపిస్తుంది. మొదటి నుంచి ఎన్నో ఢక్కా మొక్కీలు తిన్న మూవీ ‘గుంటూరు కారం’ ఎలాగోలా రిలీజై ఫస్డ్ డేనే ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. దాదాపు 3 సంవత్సరాల పాటు షూటింగ్ కొనసాగింది. అటు మహేశ్ బాబు కెరీర్ లోగానీ ఇటు త్రివిక్రమ్ కెరీర్ లో గానీ ఇంత కాలం షూటింగ్ చేసుకున్న మూవీ మరోటి లేదు. ఇంత కష్టపడినా సినిమా మాత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.
ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు (జనవరి 12)న రిలీజైంది. సినిమాను నిలబెట్టేందుకు మహేశ్ బాబు బాగానే ప్రయత్నించాడు కానీ ఆయన వల్ల కాలేదు. త్రివిక్రమ్ చెత్త స్క్రీన్ ప్లే, చెత్త రైటింగ్ అంటూ మహేశ్ అభిమానులతో పాటు సినీ అభిమానులు కూడా మండి పడుతున్నారు. ఫస్ట్ డే మార్నింగ్ షో నుంచి నెగెటివ్ టాక్ రావడంతో దాని ప్రభావం సినిమాపై బలంగా పడింది. త్రివిక్రమ్ సినిమా రాక పుష్కరకాలం దాటింది.. దీంతో మహేశ్, త్రివిక్రమ్ ఫ్యాన్స్ గుంటూరు కారంపై భారీగా ఆశలు పెట్టుకున్నారు.
దీన్ని సంక్రాంతికి రిలీజ్ చేస్తే విద్యార్థులకు సెలవులు కూడా కలిసి వస్తాయని బాగానే కలలు కన్నారు. హైదరాబాద్, వరంగల్, విశాఖపట్నం, విజయవాడ లాంటి నగరాల్లో బుక్ మై షోలో టికెట్స్ మొత్తం బ్లాక్ చేశారు. ఇక రిలీజై నెగెటివ్ టాక్ రావడంతో బ్లాక్ చేసిన టికెట్లు అమ్ముడు పోవడం లేదట. దీంతో వాటిని మళ్లీ రిలీజ్ చేస్తున్నారట.
గుంటూరు కారంతో పాటు రిలీజైన ‘హను-మాన్’ మూవీకి మార్నింగ్ షో ఫస్ట్ ఆఫ్ లోనే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఇది కూడా గుంటూరు కారంపై పడింది. గుంటూరు కారంకు వెళ్దామని బుక్ చేసుకున్న వారు సైతం వాటిని క్యాన్సిల్ చేసుకొని హను-మాన్ కు వెళ్తున్నారు. బుక్ మై షోలో ‘హను-మాన్’ మూవీకి గంటకు 20 వేలకు పైగా టికెట్స్ అమ్ముడవుతున్నాయి. ‘గుంటూరు కారం’కు కేవలం 16 వేల టిక్కెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. రేపటి నుంచి గుంటూరు కారంకు కేటాయించిన థియేటర్లలో కొన్నింటిని హను-మాన్ కు షిఫ్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.