Guntur Kaaram OTT : ‘గుంటూరు కారం’ ఓటీటీ విడుదల తేదీ ప్రకటన..ఫ్యాన్స్ కి ఇక పండగే!

'Guntur Karam' OTT release date announced.

‘Guntur Karam’ OTT release date

Guntur Kaaram OTT : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘గుంటూరు కారం’ రీసెంట్ గానే విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్  ఫలితం ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా కోస్తాంధ్ర లో తప్ప మిగిలిన అన్నీ ప్రాంతాలలో భారీ నష్టాలను తెచ్చి పెట్టింది. 140 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ సినిమాకి 90 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

అంటే దాదాపుగా 50 కోట్లు నష్టం అన్నమాట. థియేట్రికల్ రన్ ముగియడం తో ఇప్పుడు ఈ సినిమాని ఓటీటీ లో విడుదల చేసేందుకు సిద్ధం అయ్యారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ రేట్ కి కొనుగోలు చేసింది. కేవలం తెలుగు వెర్షన్ మాత్రమే కాకుండా, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో కూడా ఈ సినిమాని స్ట్రీమింగ్ చెయ్యబోతున్నారు.

కాసేపటి క్రితమే నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9 వ తారీఖున స్ట్రీమింగ్ చెయ్యబోతున్నట్టుగా ప్రకటించింది. ఒప్పందం ప్రకారం ఈ సినిమా విడుదలైన 28 రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేసుకొనుటకు అనుమతిని ఇచ్చారు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యుంటే మరికొన్ని రోజులు ఆగి స్ట్రీమింగ్ అయ్యేది. కానీ ఫ్లాప్ అవ్వడం తో ఒప్పందం ప్రకారమే 28 రోజులకు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చెయ్యబోతున్నారు. థియేటర్ లో మిశ్రమ స్పందన దక్కించుకున్న ఈ సినిమా కనీసం ఓటీటీ లో అయినా మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంటుందో లేదో చూడాలి. చాలా సినిమాలు థియేటర్స్ లో హిట్ అయ్యినవి ఓటీటీ లో విడుదలైనప్పుడు మాత్రం మిశ్రమ స్పందన దక్కించుకున్నాయి. ఉదాహరణకి రీసెంట్ గా విడుదలైన సలార్ చిత్రాన్ని తీసుకోవాలి.

అన్నీ భాషలకు కలిపి ఒకే వీడియో గా విడుదల చేసినప్పటికీ కూడా ఈ సినిమా ‘ఎనిమల్’ స్ట్రీమింగ్ అవ్వగానే నాల్గవ స్థానం కి పడిపోయింది. అంటే ఈ సినిమా ని నెట్ ఫ్లిక్స్ ఆడియన్స్ పెద్దగా చూడలేదు అన్నమాట. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా ఓటీటీ లో మంచి వ్యూస్ దక్కించుకున్నాయి. మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ ఇద్దరికీ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. కాబట్టి ఈ సినిమా కచ్చితంగా ఓటీటీ ఆడియన్స్ కి రీచ్ అవుతుందని నమ్ముతున్నారు ట్రేడ్ పండితులు.

TAGS