JAISW News Telugu

Guntur Kaaram : ‘గుంటూరు కారం’ మొదటి వారం వసూళ్లు..డిజాస్టర్ టాక్ తో 70 శాతం రికవరీ!

Guntur Kaaram

Guntur Kaaram First Week Collections

Guntur Kaaram  First Week Collections : హిట్ టాక్ వచ్చినప్పుడు ఎవరైనా కలెక్షన్స్ ని కొల్లగొడుతున్న రోజులివి. ఓటీటీ యుగం లోకి అడుగుపెట్టిన తర్వాత ఆడియన్స్ ఫ్లాప్ సినిమాల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. అలాంటి ఈ రోజుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు డిజాస్టర్ ఫ్లాప్ టాక్ తో సృష్టిస్తున్న అద్భుతాలను చూసి ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపోయారు. రీసెంట్ గా సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైన సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రం మొదటి ఆట నుండి ఎలాంటి డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

సంక్రాంతి సెలవులు ఈ చిత్రానికి కలిసి వస్తాయి, డీసెంట్ స్థాయి వసూళ్లు వస్తాయని అనుకున్నారు కానీ, దాదాపుగా 70 శాతం కి పైగా రికవరీ రేట్ ని కేవలం వారం రోజుల్లోనే చేస్తుందని మాత్రం ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఒకపక్క ‘హనుమాన్’ మేనియా ని తట్టుకొని, భారీ టికెట్ రేట్స్ మరియు ఫ్లాప్ టాక్ ఉన్నప్పటికీ కూడా ఇంత రికవరీ చేసిందంటే మహేష్ బాబు స్టార్ స్టేటస్ ఎలాంటిదో ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు.

ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి మొదటి వారం దాదాపుగా 80 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు. ఇది మంచి వసూళ్లే అయినప్పటికీ బ్రేక్ ఈవెన్ మార్కుకి చేరుకోవడం కోసం ఏమాత్రం కూడా సరిపడదు. ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా అన్నీ ప్రాంతాలకు కలిపి 140 కోట్ల రూపాయలకు జరిగింది. నైజాం ప్రాంతం లో 45 కోట్ల రూపాయలకు ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కానీ ఇప్పటి వరకు ఈ సినిమాకి కేవలం 23 కోట్ల రూపాయిల షేర్ వసూలు చేసింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకాఆ 18 కోట్ల రూపాయిలు రాబట్టాలి అది దాదాపుగా అసాధ్యమే. ఇక ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ మార్కుని దాటాలంటే 5 మిలియన్ డాలర్లు వసూలు చెయ్యాలి.

ఇది కూడా అసాధ్యమే. కానీ ఆంధ్ర ప్రాంతం లో ఈస్ట్ గోదావరి, ఉత్తరాంధ్ర, కృష్ణా వంటి చోట్ల బ్రేక్ ఈవెన్ అయ్యేందుకు సిద్ధం గా ఉన్నట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా సంక్రాంతి సెలవులు ఈ సినిమాకి బాగా కలిసొచ్చాయనే చెప్పాలి. లేకుండా మహేష్ బాబు కెరీర్ లో మరో ‘బ్రహ్మోత్సవం’, ‘స్పై డర్’ లాంటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ అయ్యేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. సినిమా మొత్తం మహేష్ తన టైమింగ్ తో, ఎనర్జీ తో నడిపించడం కూడా బాగా ప్లస్ అయ్యింది.

Exit mobile version