Gunturkaaram : గత ఏడాది పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘బ్రో ది అవతార్’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అంతంత మాత్రంగానే ఆడిన సంగతి అందరికీ తెలిసిందే. సాంగ్స్, ఫైట్స్, హీరోయిన్ ఇవేమి లేకుండా, కమర్షియల్ ఎలెమెంట్స్ కి దూరంగా పవన్ కళ్యాణ్ నుండి వచ్చిన సినిమా కావడంతో అభిమానులు బాగా హర్ట్ అయ్యారు. కానీ ఈ సినిమాకి అనుకున్న దానికంటే బెటర్ థియేట్రికల్ రన్ వచ్చిందనే చెప్పాలి.
హైదరాబాద్ వంటి సిటీ లో ఈ చిత్రాన్ని రీసెంట్ గా విడుదలైన ‘గుంటూరు కారం’ చిత్రం మ్యాచ్ చెయ్యలేకపోయింది. సంక్రాంతి పండుగ సెలవులు అడ్వాంటేజ్ తో భారీ షోస్, భారీ థియేటర్స్ తో విడుదలైనా కూడా ఈ సినిమా ‘బ్రో’ చిత్రాన్ని దాటలేకపోయిందంటే ఏ రేంజ్ డిజాస్టర్ ఫ్లాప్ అనేది అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో పవన్ కళ్యాణ్ బ్రో చిత్రానికి హైదరాబాద్ లో కేవలం 650 షోస్ మాత్రమే పడ్డాయి. టికెట్ రేట్స్ మల్టీప్లెక్స్ షోస్ కి 295 , సింగిల్ స్క్రీన్స్ కి 175 రూపాయిలు బ్రో చిత్రానికి ఉండేది.
కానీ ‘గుంటూరు కారం’ చిత్రానికి మల్టీప్లెక్స్ రేట్స్ 400 రూపాయిలు, సింగిల్ స్క్రీన్స్ 200 రూపాయిలు పెట్టారు. మొదటి రోజు హైదరాబాద్ సిటీ మొత్తం మీద దాదాపుగా 1400 షోస్ పడ్డాయి. #RRR చిత్రానికి కూడా ఇన్ని షోస్ పడలేదు. మొదటి వారం మొత్తం కూడా ఇదే రేంజ్ రేట్స్ తో, మంచి షోస్ తో నడవబడిన ఈ చిత్రానికి నేషనల్ మల్టీప్లెక్స్ చైన్స్ నుండి హైదరాబాద్ సిటీ లో కేవలం 7 కోట్ల 40 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మరో పక్క బ్రో చిత్రానికి అంత తక్కువ రేట్స్, షోస్ తో 7 కోట్ల 50 గ్రాస్ వసూళ్లు వచ్చాయి. సంక్రాంతి సెలవులు కాబట్టి ‘గుంటూరు కారం ‘ చిత్రానికి ఆ మాత్రం వసూళ్లు అయిన వచ్చాయి, లేకుంటే ఇంకా ఘోరమైన పరిస్థితి ఉండేది అంటూ ట్రేడ్ పండితులు చెప్తున్న మాట.
బెంగళూరు సిటీ లో కూడా ఈ చిత్రానికి మొదటి వారం బ్రో సినిమా కంటే తక్కువ వసూళ్లు వచ్చాయి. త్రివిక్రమ్, మహేష్ బాబు లాంటి దిగ్గజాల కాంబినేషన్ నుండి ఇలాంటి వసూళ్లు వచ్చే సినిమా వస్తుందని కలలో కూడా ఊహించలేదంటూ ట్రేడ్ పండితులు కామెంట్స్ చేస్తున్నారు.మహేష్ బాబు ఇక నుండి అయినా ఇలాంటి సినిమాలు చేయకుంటే బాగుంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.