Guntur Kaaram : ఎన్నో భారీ అంచనాల నడుమ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన ‘గుంటూరు కారం’ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై మొదటి ఆట నుండే నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. మహేష్ బాబు ఈ వయస్సులో కూడా తనలోని ఎనర్జీ మొత్తాన్ని బయటకి తీసి అభిమానులను అలరించడానికి తన వంతు కృషి చేసాడు కానీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం ఆయన్ని దారుణంగా మోసం చేసాడనే చెప్పాలి.
అసలు సినిమా ప్రారంభించే ముందు కథ గురించి చర్చలు జరిపారా?, బౌండెడ్ స్క్రిప్ట్ ఉంటే తప్ప సినిమా ఒప్పుకోని మహేష్ బాబు, ఇంత నాసిరకపు స్టోరీ ని ఎలా ఒప్పుకున్నాడు అంటూ సోషల్ మీడియా లో అభిమానులు వాపోయారు. అలా సినిమా కంటెంట్ పరంగా అభిమానులను నిరాశ పర్చినప్పటికీ ఓపెనింగ్స్ విషయం లో మాత్రం నిరాశపర్చలేదు. నిన్న వచ్చిన ఓపెనింగ్స్ తో మహేష్ తన స్టార్ స్టేటస్ ఎలాంటిదో మరోసారి అందరికీ అర్థం అయ్యేలా చేసాడు.
ఓవర్సీస్ లోని నార్త్ అమెరికా లో ఈ చిత్రం ప్రీమియర్స్ + మొదటి రోజు వసూళ్లు కలిపి దాదాపుగా రెండు మిలియన్ డాలర్లను వసూలు చేసింది. కొంతమంది స్టార్ హీరోలకు క్లోసింగ్ కలెక్షన్స్ కూడా ఈ రేంజ్ లేవు. ఇక నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి మొదటి రోజు దాదాపుగా 13 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వంటి సెంటర్ లో ఈ చిత్రానికి మొదటి రోజు 88 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. #RRR చిత్రానికి ఇక్కడ మొదటి రోజు కేవలం 77 లక్షల రూపాయిలు మాత్రమే వచ్చింది. ఈ రికార్డు ని మహేష్ బాబు డిసాస్టర్ టాక్ తో బ్రేక్ చెయ్యడం ఆశ్చర్యార్ధకం. ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ సినిమా మొదటి రోజు 31 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఇది మహేష్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్ గా చెప్తున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి మొదటి రోజు దాదాపుగా 45 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయని చెప్తున్నారు. సంక్రాంతి సెలవలు పూర్తి అయ్యే వరకు ఈ చిత్రానికి మంచి వసూళ్లు అయితే కచ్చితంగా వస్తాయి. అప్పటి వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత రికవర్ చేస్తుందో చూడాలి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని దాటాలంటే 150 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంది.