Guess Actress : అమ్మా బాబోయ్.. ఒక్క సినిమాకే ఈ ముద్దుగుమ్మ ఇన్ని కోట్లు తీసుకుంటుందా..
Guess Actress : పైన కనిపిస్తున్న ముద్దుగుమ్మ ఎవరో కనిపెట్టారా.. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటి. బ్యూటీ క్వీన్ అయిన ఈ ముద్దుగుమ్మ చిన్న వయసులోనే కోట్లు డిమాండ్ చేస్తూ రెండు చేతులా సంపాదించేస్తోంది.
ఒక్కసారి హిరోయిన్ అయితే చాలు చాలా మంది దశ తిరిగిపోతుంటుంది. కానీ నిలదొక్కుకుని రాణించడం మాత్రం చాలా కష్టం. దీంతో హిరోయిన్లు చాలా మంది దీపముండగానే.. ఇళ్లు చక్కబెట్టుకుంటున్నారు. ఒకటి రెండు సినిమాలు చేసి భారీగా డబ్బులు అడుగుతున్నారు. మీ సినిమా చేయాలంటే నాకు కోటి నుంచి ఆ పైనే కావాలని డిమాండ్ చేస్తున్నారు.
సినీ ఇండస్ట్రీలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్నది ఎవరో తెలుసా..?
చిన్నవయసులోనే కోట్ల రూపాయిలను సంపాదించింది. అమ్మడు వయసు 27 అయినా సంపాదించేది మాత్రం కోట్లలోనే. వరుసగా సినిమాలు చేస్తున్న ఒక్క పెద్ద హిట్ పడలేదు. ఆమె అందాల శ్రీదేవి గారాల పట్టీ జాన్వీ కపూర్
శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జాన్వీ అనతి కాలంలోనే మంచి పేరు సంపాదించుకుంది. బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకెళుతుంది. ఇప్పటికే అనేక సినిమాల్లో యాక్ట్ చేసిన జాన్వీ.. కొత్త సినిమా మహి మంచి విజయాన్ని అందుకుంది. కమర్షియల్ మూవీస్ తో పాటు.. మిగతా మూవీల్లో నటిస్తూ బాగా బిజీ అయిపోయింది. గ్లామర్ డోస్ కూడా ఎంత కావాలో అంత తీసుకోండని కుర్రకారును రెచ్చగొడుతుంది.
జాన్వీ కపూర్ ఈ మధ్యే తాను సంపాదించిన దాంట్లోంచి కొత్త బంగ్లా కొన్నట్లు సమాచారం. జాన్వీ వద్ద బోలెడన్నీ కార్లు ఉన్నాయి. అందులో ఎక్కువగా విలువ చేసే కార్లు ఉన్నట్లు తెలుస్తోంది. జాన్వీ ప్రస్తుతం తెలుగులో దేవర లో ఎన్టీఆర్ సరసన నటిస్తోంది. రామ్ చరణ్ తో కూడా ఓ మూవీలో నటిస్తోంది. ఇలా శ్రీదేశి కూతురు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని పలు సినిమాలకు భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటూ దూసుకుపోతుంది. మరి జాన్వీ నటించిన దేవర పై ఎన్టీఆర్ చాలా హోప్స్ పెట్టుకున్నారు.
View this post on Instagram