JAISW News Telugu

Kodali Nani Viral Video : గుడివాడ అనకొండ కొడాలి నాని ‘మట్టిమాయ’..వైరల్ వీడియో

Kodali Nani

Kodali Nani

Kodali Nani Viral Video : ఏపీలో ఎన్నికలకు మరో నాలుగు రోజుల సమయమే ఉంది. ఎల్లుండిలోగా ప్రచారం పూర్తికానుంది. కూటమి పార్టీలు దూకుడుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఓ పక్క చంద్రబాబు, మరో పక్క పవన్ కల్యాణ్..వీరే కాక మోదీ, అమిత్ షాలతో భారీ బహిరంగ సభలు, రోడ్ షోలతో కూటమిలో సందడి నెలకొంది. ఇక అధికార వైసీపీపై అడుగడుగునా జనాల్లో  తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యే దందాలతో ఐదేండ్లు నరకం అనుభవించారు. ఇక గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని భూమాయపై జనాలు మండిపడుతున్నారు. ఆయన భూదందాపై ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కొడాలి నాని చేసిన దుర్మార్గాలను ఆధారాలతో సహ ఆ వీడియోలో చూపించడంతో ప్రజలు నానిని చీదరించుకుంటున్నారు. ఆ వీడియో సారాంశమిదే..

గుడివాడలో అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే ఒక్క పని కూడా చేయకుండా అనకొండలా కొడాలి నాని వందల కోట్లు మింగేశాడని అందులో ఆరోపించారు. నాని అనుచరులు దుగ్గిపాటి శశిభూషణ్, పాలడుగు రామ్ ప్రసాద్, గేదెల బాబ్జీ, కొల్లి విజయ్ మరికొంత మంది కలిసి అమాయక ప్రజలను అడ్డుపెట్టుకుని కోట్ల రూపాయలు మింగేశారు. గుడివాడ నియోజకవర్గంలోని మల్లాయపాలెం లోతట్టు ప్రాంతంలో గవర్నమెంట్ సెంటు భూములు ఇచ్చింది. ఆ ప్రాంతంపై, స్థలాలపై ఎమ్మెల్యే నాని, అతడి అనుచరుల కన్ను పడింది. అవకాశాన్ని సొమ్ము చేసుకోవాలని పన్నాగం పన్నారు ఆ దుండగులు.

లోతట్టు ప్రాంతంలో మట్టి నింపాలని అందుకోసం నిధులు కావాలని తమకు అనుకూలంగా ఉన్న ఉన్నతాధికారుల సహకారంతో సామాన్య పేదల పేర్ల మీద బీనామీ కాంట్రాక్టులు చేపట్టి.. వారి ఖాతాలకు వందల కోట్లు మళ్లించి కోట్లకు పడగలెత్తారు కొడాలి నాని ముఠా. లోతట్టు ప్రాంతాన్ని మెరక చేయాలనే నెపంతో మట్టితో పూడ్చడానికి రూరల్ మండలాల్లో పలు చెరువులను అక్రమంగా తవ్వి ఆ మట్టిని కూడా అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. ఇలా నాని అక్రమాలను ఆ వీడియోలో పూసగుచ్చినట్టు చెప్పారు. వీటికి సంబంధించిన ఆధారాలను ఈడీ, సీబీఐలకు కూడా ఇచ్చినట్టు అందులో పేర్కొన్నారు. ఈ వీడియో నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రమంతా వైరల్ అవుతోంది. నాని దుర్మార్గాలను ప్రజలు కళ్లారా చూస్తున్నారు. ఈ వీడియో చూసిన ఓటర్ ఒక్కరు కూడా కొడాలి నానికి ఓటు వేయరనడంలో సందేహం లేదు. మీరు కూడా ఒక సారి ఈ వీడియో చూడండి మరి..

Exit mobile version