GT VS RCB : గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ మ్యాచ్ శనివారం సాయంత్రం జరగనుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారనుంది. గుజరాత్ 10 మ్యాచుల్లో నాలుగు మాత్రమే గెలిచి 8 పాయింట్లతో ఉంది. మిగతా నాలుగు మ్యాచులు గెలిస్తే 16 పాయింట్లు వస్తాయి. నెట్ రన్ రేట్ కూడా మెరగువుతుంది. దీంతో ప్లే ఆప్స్ వెళ్లే చాన్స్ ఉంటుంది.
ఆర్సీబీ 11 మ్యాచులు ఆడి కేవలం మూడింట్లోనే గెలిచింది. మిగిలిన మూడు మ్యాచులు గెలిచినా.. వారికి కేవలం 14 పాయింట్లు మాత్రమే వస్తాయి. కాబట్టి ప్లే ఆప్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించినట్లే. మిగతా అయిదు జట్లు ఇప్పటికే 12 పాయింట్లు సాధించేశాయి. ఆ జట్లకు ఒక్కో దానికి మూడు మ్యాచులు మిగిలి ఉన్నాయి. కాబట్టి ఒక్క దాంట్లో గెలిచిన వాటికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
ఆర్సీబీ గత రెండు మ్యాచులు వరుసగా గెలిచి ఊపు మీద ఉంది. విల్ జాక్స్ సెంచరీ చేయడం, విరాట్ కొహ్లీ తన బ్యాటింగ్ ఫామ్ ను కొనసాగిస్తుండడం ఫ్లస్ పాయింట్. గత మ్యాచులో ఆర్సీబీ గుజరాత్ టైటాన్స్ పై భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. గుజరాత్ మాత్రం బ్యాటింగ్ , బౌలింగ్ లో తడబడుతోంది. గుజరాత్ బ్యాటింగ్ లో సాహా, గిల్ మంచి ఓపెనింగ్ భాగస్వామ్యాలు ఇవ్వలేకపోతున్నారు. మిడిలార్దర్ లో డేవిడ్ మిల్లర్ రాణించడం లేదు. మిగతా బ్యాటర్లు కూడా పెద్దగా పరుగులు చేయలేకపోతున్నారు.
గుజరాత్ నుంచి రషీద్ ఖాన్ ఇప్పటి వరకు కేవలం 10 మ్యాచులు ఆడి కేవలం 8 వికెట్లు మాత్రమే తీశాడు. గత సీజన్ లో 10 మ్యాచుల్లో 18 వికెట్లు తీయగా.. ఈ సారి దారుణంగా విఫలమవుతున్నాడు. మోహిత్ శర్మ గత రెండు మ్యాచుల్లో దారాళంగా పరుగులు ఇచ్చేశాడు. దీంతో గుజరాత్ వరుస ఓటములతో సతమతమవుతోంది. బెంగళూరు లోని చిదంబరం స్టేడింయలో మ్యాచ్ జరగనుండడంతో ఆర్సీబీకి కలిసి రానుంది.
ఆర్సీబీ బౌలింగ్ లో కాస్త మెరుగుపడింది. కెప్టెన్ డుఫ్లెసిస్ నుంచి ఆర్సీబీ భారీ ఇన్సింగ్స్ ఆశిస్తోంది. ఈ సాయంత్రంతో గుజరాత్, ఆర్సీబీ రెండింటిలో ప్లే ఆప్ రేసు నుంచి తప్పుకొనేదెవరో తేలిపోనుంది.