First Night : శోభనం రాత్రి వరుడి కక్కుర్తి.. తీవ్ర రక్తస్రావంతో నవ వధువు మృతి
First Night Bride Died : ముద్దన్నా, శృంగారమన్నా ఎవరికి చేదు ఉండదు..మగువ అందాలను ఆస్వాదించాలని పురుషపుంగవులు అంగలార్చడం చూస్తూనే ఉంటాం. తనవితీరా ‘అనుభవం’ పొందాలనుకునే రసిక రాజాలు కూడా ఉంటారు. ఇక తమ తొలి కలయిక జీవితాంతం గుర్తుండిపోవాలని కలలు కంటారు కొందరు పెళ్లికాని యువకులు. ఇలాంటి కలలు కనే ఓ యువకుడు తొలిరేయిని జీవితాంతం మరిచిపోలేని సంఘటనగా మార్చుకున్నాడు.
కొత్తగా పెళ్లైంది. ఇక తొలిరాత్రిలోనే తన భార్య అందాలను తనవితీరా జుర్రుకోవాలని, ఆ అనుభూతిని మదిలో చిరకాలం భద్రపరుచుకోవాలని భావించాడు. అందుకు శృంగార సామర్థ్యాన్ని పెంచే పిల్స్ ఉపయోగించాడు. ఆ తర్వాత భార్యతో శృంగారంలో పాల్గొన్నాడు. అయితే ఆ చర్యలో ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. మూడు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆ నూతన వధువు తనువు చాలించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని హమీర్ పూర్ లో జరిగింది.
హమీర్ పూర్ పరిధిలోని ఉరైకు చెందిన ఓ ఇంజినీర్ ఈ నెల 3వ తేదీన వివాహం చేసుకున్నాడు. ఇక 4వ తేదీన పుట్టింటి నుంచి 4వ తేదీన నూతన వధువు అత్తారింటికి వెళ్లింది. ఫిబ్రవరి 7న వరుడి ఇంట్లో నూతన దంపతులకు శోభనం ఏర్పాట్లు చేశారు. అయితే తొలిరాత్రి మజాను అందరికంటే ‘ఘనంగా’ అనుభవించాలనకున్న వరుడు..శృంగార సామర్థ్యాన్ని పెంచే పిల్స్ తీసుకున్నాడు. అనంతరం భార్యతో శృంగారంలో పాల్గొన్నాడు.
అయితే వధువుకు తీవ్ర రక్తస్రావం జరిగింది. అస్వస్థతకు గురికావడంతో ఆమెను కాన్పూర్ జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ 10వ తేదీన మరణించింది. ఈ ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని ఆమె కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.