Bhashyam Praveen : టిడిపి పల్నాడు జిల్లా అధ్యక్షుడికి శుభాకాంక్షలు – జిల్లా కార్యాలయంలో తెలియజేసిన ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్

Bhashyam Praveen
Bhashyam Praveen : పెదకూరపాడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ టిడిపి పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ రోజు ఉదయం శ్రీధర్ బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ఆయనను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. పెదకూరపాడు నియోజకవర్గంలో తన గెలుపునకు సహకరించవలసిందిగా కోరారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలిచే అవకాశముందని అన్నారు. అయినప్పటికీ టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు కూటమి అభ్యర్థుల విజయానికి శాయశక్తులా కృషి చేయాలని సూచించారు.
పెదకూరపాడు నియోజకవర్గంలో భాష్యం ప్రవీణ్ తప్పకుండా అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తారని జోస్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ తో పాటు పెదకూరపాడు నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.