Chennai woman : చెన్నైకి చెందిన ఆర్థోడాంటిస్ట్ డాక్టర్ ఇసా ఫాతిమా జాస్మిన్ చేసిన పనికి దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. నిస్వార్థ ప్రజాసేవ శక్తిని బలంగా విశ్వసించే తల్లిదండ్రుల చెంత పెరిగింది ఫాతిమా. ఆమె తన తండ్రి పేదల కోసం వార్షిక ఛారిటీ డ్రైవ్‌లను నిర్వహించేవారు. అవసరమైన వారికి సహాయం చేయడానికి తండ్రి మార్గాన్నే ఎంచుకున్నారు. 2017లో లాభాపేక్ష లేని కమ్యూనిటీ ఆర్గనైజేషన్ అయిన ది పబ్లిక్ ఫౌండేషన్‌ని ప్రారంభించారు. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలన్న తపనలో నుంచి పుట్టిందే ఈ ఆలోచన. ఇందులో అయ్యమిట్టున్ అనే కమ్యూనిటీ ఫ్రిజ్ ఉంది. ఇది అవసరమైన వారికి ఆహారాన్ని అందిస్తుంది. ఇది ప్రతిరోజూ వృధా అయ్యే ఆహారాన్ని ఇందులో ఉంచుతారు. ప్రజలు వచ్చి మిగిలిపోయిన ఆహారం, పుస్తకాలు, బట్టలు లేదా ఒకప్పుడు ఇష్టపడే వస్తువులను విరాళంగా ఇందులో పెడతారు.
ఇది ఇతరులకు సహాయం చేయడానికి ఒక ప్లాట్‌ఫారమ్. ఇది ఇప్పుడు ఎనిమిది కేంద్రాలకు విస్తరించింది. చెన్నైలో, బెంగళూరులో రెండు ఉన్నాయి. ప్రతి కేంద్రంలో ఆహారాన్ని నిల్వ చేయడానికి 400 నుండి 600 లీటర్ల సామర్థ్యం గల కమ్యూనిటీ రిఫ్రిజిరేటర్ ఉంది. ఎవరైనా విరాళం ఇవ్వాలనుకునే వారు తమ సౌకర్యాన్ని బట్టి కేంద్రాలను సందర్శించి వస్తువులను అక్కడ ఉంచవచ్చు. ప్రతి కేంద్రంలో కనీసం 100మందికి భోజనాన్ని అందిస్తున్నారు.