JAISW News Telugu

Australia Vs England : ఇంగ్లండ్ పై ఆస్ట్రేలియా ఘన విజయం

Australia Vs England

Australia Vs England

Australia Vs England : కెన్నింగ్ టన్ ఓవల్ బార్బడోస్ లో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లండ్ పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకోగా.. డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్ ఇద్దరు ఏడాపెడా బౌండరీలు, సిక్సులతో విరుచుకుపడ్డారు. దీంతో అయిదు  ఓవర్లలోనే 70 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. 16 బంతుల్లోనే 39 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్ నాలుగు సిక్సులు, రెండు ఫోర్లు బాదగా.. హెడ్ 18 బంతుల్లో 38 పరుగులు చేశాడు.

హెడ్ మూడు సిక్సులు, రెండు ఫోర్లు బాదడం విశేషం. వీరిద్దరు ఔటైనా కూడా మిగతా బ్యాట్స్ మెన్ సమయోచితంగా ఆడి ఆసీస్ కు 201 పరుగుల భారీ స్కోరు అందించారు. మ్యాక్స్ వెల్ 28, కెప్టెన్ మిచెల్ మార్ష్ 35, మార్కస్ స్టోనియిస్ 30, వేడ్ 17 పరుగులు చేయగా.. ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 201 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో మొయిన్ అలీ, లివింగ్ స్టోన్ చెరో వికెట్ తీయగా.. జోర్డాన్ రెండు వికెట్లతో రాణించాడు.

అనంతరం 202 పరుగుల ఛేజింగ్ తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కు బట్లర్, పిల్ సాల్ట్ అదిరిపోయే ఆరంభమిచ్చారు. సాల్ట్, బట్లర్ ఇద్దరు కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. పవర్ ప్లే లోనే స్కోరు బోర్డును 70 పరుగులకు చేర్చగా.. 70 పరుగుల వద్ద వీరి భాగస్వామ్యాన్ని అడమ్ జంపా విడదీశాడు. జంపా పిల్ సాల్ట్ ను బౌల్డ్ చేయగా.. ఆ తర్వాతి ఓవర్ లోనే బట్లర్ వికెట్ తీసి ఆసీస్ గెలుపును సునాయాసం చేశాడు.

అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన మొయిన్ అలీ కాసేపు బ్యాట్ ఝలిపించినా ఆ స్కోరు ఏమీ సరిపోలేదు. విల్ జాక్స్, లివింగ్ స్టోన్, బ్రూక్ వేగంగా పరుగులు చేయకపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 165 పరుగులే చేసి ఇంగ్లండ్ 36 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది.

Exit mobile version