JAISW News Telugu

Great Wall of China : గ్రేట్ వాల్ ఆఫ్ చైనా మీరు వినేవి శుద్ధ అబద్ధం.. అసలు నిజాలు ఇవీ..తెలుసుకోండి..

Great Wall of China

Great Wall of China

Great Wall of China : గ్రేట్ వాల్ ఆఫ్ చైనా.. ప్రపంచ 7 వింతల్లో ఒకటి. దీనిపై ఎన్ని కథనాలు వచ్చినా మరిన్ని కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఉంటుంది ఎవరికైనా. అయితే ఈ వాల్ గురించి కొన్ని అతిశయోక్తులు, శుద్ధ అబద్ధాలు కూడా ప్రచారం అవుతుంటాయి. దీని గురించి పూర్తిగా తెలిసిన వారు చాలా తక్కువ. చైనాలో పాత పుస్తకాలు, పురాణాల ద్వారా చైనా వాల్ విశేషాలను తెలుసుకుంటూ ఉంటారు.

గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఉత్తర చైనాలో నిర్మించిన అతి పురాతన గోడలు, కోటల సమాహారం. వందల ఏండ్ల కిందట దీన్ని నిర్మించారు. మొదట్లో దీని పొడవు సుమారు 2400 కి.మీ. నుంచి 8000 కి.మీ. ఉంటుందని అంచనా వేశారు. కానీ 2012లో చైనా పురావస్తు శాఖ అధ్యయనంలో ఈ గోడ పొడవు దాని కంటే చాలా ఎక్కువని తెలిసింది. 21 వేల కి.మీ. పైనే ఉంటుందని తేలింది.

అత్యంత అద్భుతమైన ఈ చైనా వాల్ గురించి ఎన్నో అపోహలు, అబద్ధాలు ప్రచారమవుతున్నాయని చెప్పుకున్నాం కదా. జాన్ మాన్ అనే రచయిత తన ‘ది గ్రేట్ వాల్’ అనే పుస్తకంలో చైనా వాల్ పై ఉన్న అపోహలను తొలగించే ప్రయత్నం చేశారు. ఒకసారి వాటిని వివరంగా చూద్దాం..

చంద్రుడి నుంచి కనిపిస్తుంది..:
చంద్రుడి నుంచి చూస్తే భూమిపై కనపడే ఏకైక కట్టడం చైనావాల్ అని తెగ ప్రచారం అవుతుంటుంది. అయితే దీనిపై ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదని అంటున్నారు. ఈ విషయాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు కూడా కొట్టిపారేస్తున్నారు. 2003లో చైనా తొలి అంతరిక్ష విమానాన్ని ఆకాశంలోకి పంపినప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది. అంతరిక్షం నుంచి తాము చైనా వాల్ ను చూడలేకపోయామని వారు తేల్చేశారు.

ఇది ఒకటే గోడ:
ఇది ఒకటే గోడ కాదు. చాలా గోడల కలయిక. వీటిలో చాలా విభాగాలు ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రమే అద్భుత నిర్మాణంతో పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. చాలా ప్రాంతాల్లో ఈ గోడలు రెండింతలు, మూడింతలు, కొన్నింటి దగ్గర నాలుగింతలు ఎక్కువ వెడల్పు లో ఉంటాయి. ఈ విభాగాలన్నీ ఒక దానిపై ఒకటి ఓవర్ ల్యాప్ అయి ఉంటాయి.

గోడ లోపల శవాలు:
గోడ లోపల కార్మికులను సమాధి చేసినట్లు రూమర్స్ ఉన్నాయి. అయితే ఈ గోడ లోపల ఎక్కడా మనుషుల ఎముకలు కనిపించలేదు. దీనికి ఎలాంటి పురావస్తు లేదా రాతపూర్వక ఆధారాలు కూడా లేవు. ఇది పూర్తి అవాస్తవమని వారు తేల్చారు.

మంగోలులను అడ్డుకోవడానికి కట్టారు:
క్రీస్తు పూర్వం 210 లో చనిపోయిన తొలి చక్రవర్తే ఈ గోడ కట్టడాన్ని ప్రారంభించారు. మంగోలులు క్రీస్తు శకం 800  నుంచి మంగోలులు చరిత్రలో కనపడుతారు. చైనీయులకు, మంగోలులకు మధ్య ఘర్షణ 14వ శతాబ్దం తర్వాత మొదలైంది. మింగ్ వంశపాలకులు అప్పట్లో మంగోలులను చైనా నుంచి బహిష్కరించారు.

మార్క్ పోలో దీన్ని సందర్శించారు:
వెనిస్ యాత్రికుడు మార్క్ పోలో దీని గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. ఆయన దీని గురించి చెప్పకపోవడమే కాదు ఆయన ఎప్పుడూ చైనాకు వెళ్లలేదనే వాదన కూడా ఉంది. కానీ మార్క్ పోలో పలుసార్లు బీజింగ్ నుంచి కుబ్లా ఖాన్ ప్యాలస్ వరకు ప్రయాణించినా ఈ గోడను చూసేందుకు ఎప్పుడూ ఆసక్తి చూపలేదు.

Exit mobile version