BRS Leaders : ఇరకాటంలో బీఆర్ఎస్ మహా నేతలు.. సార్వత్రిక ఎన్నికల ముంచుకస్తున్న వేల సర్ కోసం ఎదురుచూపు..

K Chandrasekhar Rao

BRS Leaders : పార్టీని కొనసాగించడంపై మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు సందిగ్ధంలో పడ్డారు. పార్టీ అధినేత అజ్ఞాతంలో ఉండడంతో పార్టీలోనే ఉండాలా? లేదంటే వీడి పోవాలా? అనే నిర్ణయం తీసుకోలేకపోతున్నారు.

జాతీయ పార్టీగా పేరు మార్చిన బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ పొరుగున ఉన్న మహారాష్ట్రపై అప్పట్లో దృష్టి సారించారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్, నాందేడ్, లాతూర్, కొల్హాపూర్, కందర్లోహా జిల్లాలపై దృష్టి సారించిన ఆయన పెద్ద ఎత్తున నేతలను పార్టీలోకి చేర్పించుకునేందుకు భారీ ప్రణాళికలు రచించారు.

పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రోత్సహించేందుకు ఆయన ఈ ప్రాంతాల్లో బహిరంగ సభలు, సమావేశాలు కూడా నిర్వహించారు. ఇతర పార్టీలకు చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా బీఆర్ఎస్ లో చేరారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను బరిలోకి దింపడంతో ఆ సమయంలో పార్టీలో జోరుగా కార్యకలాపాలు సాగాయి. పట్టణాల్లోని కొన్ని వార్డులతో పాటు 200 పంచాయతీలు, కొన్ని గ్రామాల్లో సర్పంచ్ పదవులను కూడా ఆ పార్టీ గెలుచుకుంది.

వాస్తవానికి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులను ఎంపిక చేసేందుకు మహారాష్ట్రలో పార్టీ నేతలు పార్టీ అధినేత ఆదేశం కోసం ఎదురు చూస్తున్నారు. కానీ కేసీఆర్ వారిని విస్మరిస్తున్నట్లు తెలుస్తోంది. ఆశ్చర్యకరంగా మహారాష్ట్ర నేతల నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ కు ఆయన స్పందించడం లేదు.

కొందరు ఉత్సాహవంతులైన నేతలు కేసీఆర్ ను కలిసేందుకు హైదరాబాద్ కు చేరుకున్నా వారికి అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదు. కల్వకుంట్ల వంశీధర్ రావు కూడా మహారాష్ట్ర నేతలకు అందుబాటులో లేరని సమాచారం. ఎలా ముందుకు వెళ్లాలో పొరుగు రాష్ట్రంలోని బీఆర్ఎస్ నేతలకు అర్థం కావడం లేదు.

ఒకానొక సమయంలో పార్టీని విస్తరించి జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించాలని కలలు గన్న కేసీఆర్ ఎంతో ఉత్సాహంగా ఉండేవారని, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఆ తర్వాత తగిలిన గాయం తర్వాత కేసీఆర్ ఏకాంతంలోకి వెళ్లిపోయినట్లు కనిపిస్తోందన్నారు.

TAGS