Chandrababu : మనవడు దేవాన్ష్ ఆట చూసి మురిసిపోతున్న తాతయ్య చంద్రబాబు

సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. నారా వారి ఫ్యామిలీ సంక్రాంతి సంబరాల కోసం తమ సొంతూరు చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెకు వెళ్లింది. అక్కడ చంద్రబాబు, భువనేశ్వరి, నారా బ్రహ్మణి, లోకేష్, ఇతర నందమూరి కుటుంబ సభ్యులు అంతా కలిసి సంబరాల్లో పాల్గొంటున్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో చంద్రబాబు మనవడు దేవాన్ష్ కుప్పి గంతులు ఆటలో పాల్గొన్నారు. ఇతర పిల్లలతో కలిసి ఒక జోర సంచిలో దిగి గెంతడం మొదలుపెట్టాడు. ఈ గేమ్ దేవాన్ష్ ఆడుతుండగా ఆట చూసి తాతయ్య చంద్రబాబు మురిసిపోయాడు.

నారా వారి సంక్రాంతి సంబరాల వీడియో వైరల్ అవుతోంది.

TAGS