Sankranti Celebrations : కెనడాలో TCA ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు..

Sankranti Celebrations

Sankranti Celebrations in Canada

Sankranti Celebrations in Canada : తెలంగాణ అసోసియేష‌న్ ఆఫ్ కెనడా (TAC) ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుక‌లు వైభవంగా జ‌రిగాయి. టోరంటో బ్రాంటెన్‌లోని చింగ్కూజీ సెకండ‌రీ స్కూల్‌ ఈ వేడుకలకు వేదికగా మారింది. 800 మందికి పైగా ప్రవాస తెలంగాణీయులు ఇందులో పాల్గొన్నారు. తెలంగాణ అసోసియేష‌న్ ఆఫ్ కెనడా ఎగ్జిక్యూటివ్ కార్యదర్శి శంత‌న్ నేర‌ళ్లప‌ల్లి ప్రారంభించ‌గా, మేఘ‌న గుర్రాల‌, శైల‌జ ఎర్ర, స్ఫూర్తి కొప్పు, ప్రవళిక మ్యాక‌ల‌, శ్రీరంజ‌ని కందూరిలు జ్యోతి ప్రజ్వల‌న చేశారు. శ్రీరామ‌ దాసు అర్గుల గ‌ణేష వంద‌నంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. అసోసియేషన్ ఎగ్జిక్యూటీవ్ కమిటీ, బోర్డు అఫ్ ట్రస్టీ, వ్యవస్థాపక సభ్యుల సహకారంతో ఘనంగా నిర్వహించారు.

రాహుల్ బ‌ల‌నేని, జ్యోతి రాచ ఆధ్వర్యంలో 15 ఏండ్ల లోపు చిన్నారులకు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్, షో అండ్ టెల్, తదితర పోటీలు ఏర్పాటు చేశారు. పోటీలకు న్యాయ నిర్ణేత‌లుగా ప్రవీణ్ నీల, గుప్తేశ్వరి వాసుపిల్లి, ఝాన్సీలక్ష్మి గరిమెళ్ల, మనశ్విని వెలపాటి వ్యవహరించారు. వంద మందికి పైగా చిన్నారులకు భోగిపళ్లు పోసి ఆశీర్వదించారు. TCA స్పాన్సర్ డాక్టర్  కాసుల సౌజన్య, యేసు బాబుతో కలిసి 2024 టోరెంటో తెలుగు క్యాలెండర్‌ను ఆవిష్కరించి కమిటీ సభ్యులకు అందజేశారు.

సంస్కృతిక కార్యదర్శి స్ఫూర్తి కొప్పు సహకారంతో శ్రీరంజని కందూరి, ప్రహళిక మ్యాకల 4 గంటల పాటు యాంకరింగ్ చేసి ప్రేక్షకులను ఆసాంతం అలరించారు. సంస్కృతిక కార్యక్రమాలకు అనూహ్య స్పందన వచ్చినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. పోటీల్లో విజయం సాధించిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి వీచ్చేసిన వారు రుచికరమైన విందు భోజనం ఏర్పాటు చేశారు. తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ మన్నెం మాట్లాడుతూ.. ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించుకోవడం ద్వారా తెలంగాణ పండుగలను, సంప్రదాయాలను భావితరాలకు తెలిపి, ముందుకు తీసుకెళ్లేందుకు దోహ‌దం చేస్తాయ‌న్నారు.

TAGS