IT Synergy 2024 : అట్టహాసంగా సినర్జీ 2024 ప్రారంభం..
IT Synergy 2024 : ITServe అలయన్స్ అనేది IT సంస్థల సేవలకు సంబంధించి అమెరికాలో అతిపెద్ద సంఘం. ఈ కూటమి యునైటెడ్ స్టేట్స్ అంతటా ఒకే విధమైన ఆసక్తులతో పనిచేస్తుస్తుంది. సంవత్సరాలుగా ఉమ్మడి ప్రయోజనాలను పరిరక్షించడం, సామూహిక విజయాన్ని నిర్ధారించే దిశలో ITServe విజయం వైపు అడుగులు వేస్తుంది. ITపై మరింత అవగాహన పెంచుకోవడం ద్వారా మెరుగైన సాంకేతిక వాతావరణం కోసం పని చేసేందుకు భాగస్వామి సంస్థలతో వ్యూహాత్మక సంబంధాలను అభివృద్ధి చేసుకోవాలని ITServe అలయన్స్ విశ్వసిస్తోంది.
సినర్జీ 2024
సినర్జీ 2024లో, పరిశ్రమ నిపుణులు మాత్రమే కాకుండా, భవిష్యత్తును రూపొందించే ట్రయల్‌బ్లేజర్లు, దూరదృష్టి గల స్పీకర్ లైనప్ ఉంటుంది. విభిన్న శ్రేణి రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తూ, ఈ నాయకులు కొత్త కొత్త ఆవిష్కరణలను నడిపించే సంచలనాత్మక ఆలోచనలను తీసుకువస్తున్నారు. సాంకేతికత, వ్యాపారం, అంతకు మించిన తెలివైన వ్యక్తులతో కనెక్ట్ అయ్యేందుకు ‘సినర్జీ 2024’ తోడ్పాడు అందజేస్తుంది.
సినర్జీ 2024 గురించి
ITServe అలయన్స్ ‘సినర్జీ కాన్ఫరెన్స్ 2024’ అమెరికాలోని లాస్ వెగాస్‌లోని సీజర్స్ ప్యాలెస్‌లో ప్రారంభించారు. కూటమి దాని సభ్యులకు ప్రపంచ స్థాయి మార్గదర్శకత్వం, నెట్‌వర్కింగ్, వ్యాపార జీవనోపాధి, న్యాయ సలహా, వృద్ధి అవకాశాలను ఈ కార్యక్రమం ద్వారా అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏడాది పొడవునా నిర్వహించే ప్రత్యక్ష, వర్చువల్ ఈవెంట్లను ప్లాన్ చేయనున్నారు.
28వ తేదీ నుంచి సినర్జీ 2024 కార్యక్రమాలు ప్రారంభయ్యాయి. మొదటి రోజు దాదాపు 3000కు పైగా సభ్యులు పాల్గొన్నారు. 29వ తేదీ-మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు రిజిస్ట్రేషన్ డెస్క్ లో నమోదు ఉంటుంది. 8 గంటల నుంచి 9.30 గంటల వరకు అల్పాహారం ఇవ్వనున్నారు. ఆ తర్వాత వివిధ కార్యక్రమాలు ఉంటాయి. రాత్రి 9 గంటలకు డిన్నర్ తో ఈ రోజు కార్యక్రమాలు ముగుస్తాయని నిర్వాహకులు తెలిపారు.
సినర్జీ 2024లో ప్రముఖులు, సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు. ఇంకా ఆయా కంపెనీలకు చెందిన ప్రముఖులు, సీఈఓలు పాల్గొన్నారు. యూ బ్లడ్ యాప్ ఫౌండర్, గ్జినాన్ ఇన్ఫో టెక్ సీఈఓ అయిన డాక్టర్ జై, జగదీష్ బాబు యలమంచిలి ప్లాటినం సభ్యుడిగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రముఖ నటి, మోడల్ ఏంజెల్ కుమార్ తో కలిసి ఫొటోలు దిగారు. మంత్రి నారా లోకేష్ తో పాటు టెక్ కంపెనీల ప్రతినిధులు, ముఖ్య వక్తలు, తదితరులతో టెక్ ఫ్యూచర్ గురించి మాట్లాడారు. రెండు రోజుల కార్యక్రమంలో ఆయన ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు.
Read more : లాస్ వేగాస్ లో అట్టహాసంగా ఐటీ సర్వ్ సైనర్జీ 2024