Annapurna Devi : ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా వేడుకలు.. అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మ

Annapurna Devi

Annapurna Devi

Durgamma as Annapurna Devi : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సన్నిధిలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు దుర్గమ్మ, అన్నపూర్ణ దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. సకల జీవరాశికి ఆహారం ప్రసాదించే అన్నపూర్ణ దేవిని దర్శించుకుంటే ఆకలిదప్పులుండవు. ప్రాణకోటికి జీవనాధారం అన్నం.. అందుకే అన్నాన్ని పరబ్రహ్మస్వరూపం అంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్షపెట్టిన అన్నపూర్ణాదేవిని ధ్యానిస్తే ధనధాన్యవృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. లోకంలో జీవుల ఆకలిని తీర్చటం కన్నా మించినది ఇంకేమీ లేదన్నదే ఈ అలంకారం వెనకున్న ఆంతర్యం.

TAGS