JAISW News Telugu

MLC Counting : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభం

MLC Counting

MLC Counting

MLC Counting : నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. నల్గొండ జిల్లాలోని తిప్పర్తి మండలం దుప్పలపల్లిలోని ప్రభుత్వ గోడౌన్స్ లో ఈరోజు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభించారు. నాలుగు హాళ్లలో ఒక్కో హాల్ కు 24 టేబుల్స్ చొప్పున మొత్తం 96 టేబుల్స్ పై కౌంటింగ్ జరుగుతోంది. 605 పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్ బాక్సులను వరుస క్రమంలో టేబుల్ కు ఒకటి కడుతున్నారు. పోస్టల్ బ్యాలెట్లను కూడా వీటితో కలిపే లెక్కించనున్నారు. తొలి ప్రాధాన్యత ఓట్లు పూర్తయ్యేసరికి అభ్యర్థుల వారీగా పోలైన ఓట్లపైన, గెలుపు కోటాపైన స్పష్టత రానుంది.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మే 27న జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికలో మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. ప్రధానంగా కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి ప్రేమేంద్ర రెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ ల మధ్యే తీవ్ర పోటీ ఉంది.

Exit mobile version