JAISW News Telugu

Governor Abdul Nazeer : గుణదల రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను ప్రారంభించిన గవర్నర్..

Governor Abdul Nazeer

Governor Abdul Nazeer

Governor Abdul Nazeer :  అమృత్‌ భారత్‌ కింద దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధిలో భాగంగా ఏపీలో 72 రైల్వే స్టేషన్లను ఆధునీకరించారు.. వీటిని ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేయుచున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని విజయవాడ గుణదల రైల్వే స్టేషన్ లో ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్ సోమవారం (ఫిబ్రవరి 26)న వీచ్చేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, ఏపీ భారతీయ జనతా పార్టీ స్టేట్ మీడియా ఇన్‌చార్జి పాతూరి నాగభూషణం, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కలెక్టర్ ఢిల్లీ రావు డీఆర్ఎం నరేంద్ర పాటిల్, అడ్డూరి శ్రీరామ్ పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో 34 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులను ప్రధాని మోడీ ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. రూ. 613 కోట్ల 30 లక్షలతో రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ట్రాక్ పెంపు, లిఫ్టులు, నూతన భవనాలు, ఎస్కలేటర్లు తదితరాలు నిర్మించి ప్రయాణికులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. విజయవాడలోని గుణదల రైల్వే స్టేషన్‌ డెవలప్ మెంట్ పనులను గవర్నర్ ప్రారంభించారు. ఈ స్టేషన్‌కు రూ. 14 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో శాటిలైట్ స్టేషన్‌గా అభివృద్ధి చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

‘అమృత్ భారత్ స్టేషన్’లో భాగంగా దేశ వ్యాప్తంగా 554 రైల్వే స్టేషన్లను ఆధునిక వసతులతో డెవలప్ చేయనున్నారు. ఈ పథకం కింద ఏపీలో 34 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తుండగా.. రాజ మహేంద్రవరం రైల్వే స్టేషన్‌ను రూ. 214 కోట్లు కేటాయించారు. గతంలో ఎన్నడూ లేనంతగా రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించిందని కార్యక్రమంలో పాల్గొన్న రైల్వే అధికారులు వెల్లడించారు. విజయవాడ – విశాఖ మధ్య రెండు రైల్వే ట్రాక్‌లను మంజూరు చేశారని, పనులు త్వరలో ప్రారంభం అవుతాయని విజయవాడ డీఆర్ఎం నరేంద్ర తెలిపారు.

Exit mobile version