Bhadrachalam : భద్రాచలం రామస్వామిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్

Bhadrachalam
Bhadrachalam : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. భద్రాచలం దేవస్థానం చేరుకున్న జిష్ణుదేవ్ వర్మ గర్భగుడిలో సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గవర్నర్ కు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ విశేషాలను వారు జిష్ణుదేవ్ వర్మకు వివరించారు. అంతకుముందు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఆలయ అర్చకులు, ఈవో రమాదేవి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. గవర్నర్ వెంట ఐఏఎస్ అధికారి బుర్ర వెంకటేశ్ ఉన్నారు.
అనంతరం గవర్నర్ ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కు చేరుకొని జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత జిల్లాకు చెందిన కవులు, రచయితలు, కళాకారులు, రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డు గ్రహీతలతో సమావేశం కానున్నారు.