Ugadi 2025 : ప్రజలకు ప్రభుత్వం ‘ఉగాది కానుక’

Ugadi Ration Biyyam
Ugadi Ration Biyyam : రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైంది. ఉగాది పండుగ రోజు సాయంత్రం 6 గంటలకు హుజూర్‌నగర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఏప్రిల్ 1 నుండి రాష్ట్రవ్యాప్తంగా అన్ని రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ జరుగుతుంది. ఈ పథకం ద్వారా 2.82 కోట్ల మంది లబ్ధి పొందనున్నారు. ప్రస్తుతం రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే.