Devineni Avinash : ప్రజా సంక్షేమం దిశగా ప్రభుత్వం అడుగులు: దేవినేని అవినాష్
Devineni Avinash : రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన వాలంటీర్ సచివాలయ వ్యవస్థ ద్వారా అవినీతికి తావులే కుండా పారదర్శకంగా ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అమలు జరుగుతుందనీ ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి తూర్పు నియోజకవర్గ పరిధిలో చేపట్టిన ‘గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నాడు 20వ డివిజన్ సత్యం గారి దొడ్డి, నెహ్రు నగర్ డొంక రోడ్డు ప్రాంతంలో దేవినేని అవినాష్ పర్యటించారు.
రాష్ట్ర కాపు కార్పొరేషన్ ఛైర్మన్, స్థానిక కార్పొరే టర్ అడపా శేషు తో కలిసి తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ ఇంటి ఇంటి కి వెళ్లి వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాం లో గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి గురుంచి వివరించారు.అదేవిధంగా సత్యంగారి దొడ్డి మెయిన్ రోడ్ దాదాపు రూ.22,18,000/-లక్షల ప్రభుత్వ నిధులతో నూతనంగా చేపట్టబోయే సి.సి. రోడ్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి పూజ కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంలో అవినాష్ మాట్లాడుతూ 20వ డివిజన్లో ఇంటి ఇంటికి తిరుగుతుంటే స్థానిక ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసే పథకాలు మీద హర్షం వ్యక్తం చేస్తం చాలా సంతో షం గా ఉంది అన్నారు.అలాగే రాజకీయా లకు అతీతం గా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నాం అని,నియోజక వర్గం లో 650 కోట్ల తో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము అని, స్థానికం గా ఉన్న డ్రైనేజి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తాం అన్నారు.
స్థానిక ఇళ్ల పట్టాల విషయాన్ని కూడా పై అధికా రుల దృష్టి కి తీసుకువెళ్లి వీలు అయినంత త్వర లో అందజేస్తాం అని హామీ ఇచ్చారు.అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు, సంక్షేమ పథకాలు అమలు చేశామని గర్వంగా చెప్పగలం అని ధీమా వ్యక్తం చేశారు.టీడీపీ ప్రభుత్వం లో ఎమ్మెల్యే, ఎంపీ,కార్పొరేటర్ ఉండి కూడా అభివృద్ధి కి నోచుకోలేదు అని,పేదవాడికి సంక్షేమ పథకాలు ఇవ్వాలి అంటే నాయకులకు లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేదని విమర్శించారు.కృష్ణలంక కరకట్ట ప్రాంతాల్లో గత టీడీపీ ప్రభుత్వం లో నాసిరకం రిటైనింగ్ వాల్ కట్టారు..
లక్ష క్యూసిక్కులు నీళ్లు వస్తే ములిగిపోయేవి స్థానిక ప్రజలు పునరావాస కేంద్రాల్లోకి తరలించే వాళ్ళు.. వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక రిటైనింగ్ వాల్ కట్టాక 10లక్షలు క్యూసిక్కులు నీళ్లు వచ్చిన స్థానిక ప్రజలు ప్రశాంతంగా నిద్రపోయేట్టు చేసిన గొప్ప నాయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ..అదేవిధంగా డొంకరోడ్ ప్రాంతాల్లో ఉన్న ఇండ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేయించే బాధ్యత వైసీపీ ప్రభుత్వానిదే అని దైర్యంగా చెవుతున్నాం.
తెలుగు దేశం పార్టీ ఎన్నికలు వచ్చాక,ఓట్లు కోసం ప్రజలు దగ్గరికి వచ్చి మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడం చంద్రబాబు కి అలవా టుగా మారింది అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరి,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, ఎన్టీఆర్ జిల్లా వక్ఫ్ బోర్డు వైస్ చైర్మన్ సుభాని, కార్పొరేటర్లు కుమారి,కొండా రెడ్డి,రామిరెడ్డి, వైసీపీ నాయకులు పళ్లెం రవి,ఎన్, యస్,యు రాజు,గొర్ల గోవింద్,శర్మ మరియు వైసీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..