Minister Kollu Ravindra : ప్రభుత్వం మద్యం దుకాణాలను పెంచలేదు: మంత్రి కొల్లు రవీంద్ర

Minister Kollu Ravindra
Minister Kollu Ravindra : కూటమి ప్రభుత్వం మద్యం దుకాణాలను పెంచలేదని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్రంలో కొత్త మద్యం విధానంపై మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీల ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.
గతంలో కల్తీ మద్యం తాగి ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పారదర్శకంగా మద్యం దుకాణాలు కేటాయించామని చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రూ.1,800 కోట్ల ఆదాయం వచ్చింది. గత ప్రభుత్వంలో రూ.1,800 కోట్ల అవినీతి జరిగింది. నాణ్యమైన మద్యాన్ని మాత్రమే అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి తెలిపారు. కొత్త మద్యం విధానం అనుసరించి మద్యం ధర తగ్గించామని, గత ప్రభుత్వ మద్యం అక్రమాలపై సీఐడీ విచారణ జరిపి అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.