Viral News : ఏడు అడుగుల ఎత్తు ఉన్న అహ్మద్ అనే కండక్టర్ మెహదీపట్నం డిపోలో పనిచేస్తున్నారు. బస్సు కేవలం 6.4 అడుగుల ఎత్తు మాత్రమే ఉండటంతో ఆయన మెడ వంచి పనిచేయాల్సి వస్తోంది. దీనివల్ల మెడ, వెన్నునొప్పి రావడంతో ఆసుపత్రి పాలయ్యారు. ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. అహ్మద్‌కు ఆర్టీసీలో సరైన ఉద్యోగం కల్పించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు సూచించారు.