Survey sticker : మీ ఇంటికి కూడా సర్వే స్టిక్కర్ అంటించారా?

survey sticker

survey sticker

survey sticker : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే (సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా, ఉద్యోగ, ఉపాధి, కులం) కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. తొలిరోజు ఎన్యుమరేటర్లు సర్వే చేయాల్సిన ఇండ్ల గుర్తింపును ప్రారంభించారు. రెండురోజుల పాటు జరిగే గుర్తింపు ప్రక్రియలో ఇండ్లకు స్టిక్కర్లు అంటించారు. ఆ తర్వాత ఇంటింటికీ వెళ్లి 57ప్రశ్నలతో వివరాలు సేకరిస్తారు. సమగ్ర కుటుంబ సర్వేకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు ఇళ్ల జాబితాను సేకరించారు.

6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మరోసారి ఇళ్లను సవరించి కుటుంబాల సంఖ్యను నిర్ధారించారు. ప్రతి ఇంటికి స్టిక్కర్లు అంటించారు. గుర్తించిన ఇళ్లలోని కుటుంబాల సర్వే శనివారం ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా సామాజిక, ఆర్థిక, విద్యా, వృత్తి, రాజకీయ, కులం వంటి వివరాలను నమోదు చేస్తారు. అయితే హైదరాబాద్ తో సహా పలు పట్టణాలు, గ్రామాల్లో కొన్ని ఇళ్లకు స్టిక్కర్లు అంటించలేదు. దీంతో తమ వివరాలను నమోదు చేస్తారా? లేదా? అని ప్రజలు అయోమయంలో పడ్డారు. దీనిపై ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.  దీనిపై ఆధార్ అడ్రస్ తో సంబంధం లేకుండా ఎక్కడ ఉన్న వాళ్లైనా సర్వేలో తమ వివరాలను నమోదు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.

TAGS