Gorantla Butchaiah : ఏపీ ప్రొటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం

Gorantla Butchaiah Chaudhary
Gorantla Butchaiah : ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. బుచ్చయ్య చౌదరితో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు నాదెండ్ల మనోహర్, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, ఆనం రామనారాయణరెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రేపు ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించనున్నారు. ఇప్పటివరకు ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ప్రొటెం స్పీకర్ గా అవకాశం కల్పించారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటి (జూన్ 21) నుంచి ప్రారంభం కానున్నాయి. శుక్రవారం ఉదయం 9.46 నిమిషాలకు ఏపీ శాసన సభ ప్రారంభం కానుంది. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి శాసనసభ సమావేశాలు జరుగనున్నాయి. రెండు రోజుల పాటు సభా కార్యక్రమాలు జరుగనుండగా.. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక ఉండనున్నాయి.