Google Lens : గూగుల్ లెన్స్ కొత్త ఫీచర్.. ఎన్నో అద్భుతాలు.. ఆక్టివేషన్ ఇలా..

Google Lens

Google Lens

Google Lens : టెక్ దిగ్గజం గూగుల్ మరో కొత్త ఫీచర్ ను పరిచయం చేస్తోంది. గూగుల్ లెన్స్ లో ఇమేజ్ రికగ్నైజేషన్ టెక్నాలజీని ప్రవేశపెట్టింది. ఈ టెక్నాలజీతో వినియోగదారులు వారి విజువల్ సెర్చ్ హిస్టరీ సేవ్ చేసుకునేందుకు అనుమతిస్తుంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్ విశ్లేషించే ఫొటోలను ఆటో మేటిక్ గా సేవ్ చేస్తుంది. ఆ తర్వాత వీక్షించేందుకు అనుమతిస్తుంది.

గూగుల్ లెన్స్ యాప్‌లో షట్టర్ బటన్‌ ఉపయోగించి ఫొటో క్యాప్చర్ చేసినప్పుడు, ఫొటో గూగుల్ కు పంపుతుంది. అందువల్ల, మీరు మీ ఫోన్ లో ఫొటోను స్టోర్ చేయలేరు. వినియోగదారులు గతంలో అయితే కెమెరా యాప్‌ ఉపయోగించి ఫొటో తీసి, గూగుల్ లెన్స్ కు పంపేలా ఉండేది.

ప్రస్తుతం గూగుల్ లెన్స్ క్యాప్చర్‌ను ఆటో మేటిక్‌గా ఆదా చేసే ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ యాప్‌లోని లెన్స్ వినియోగానికి మాత్రమే పని చేస్తుంది. మీరు గూగుల్ ఫొటోల ఇంటిగ్రేషన్, సెర్చ్ చేసేందుకు సర్కిల్‌ను ఉపయోగిస్తే ఈ ఫీచర్ వర్క్ కాదు.

మీ ఫొటో సెర్చ్ హిస్టరీని యాక్సెస్ చేసేందుకు, మీరు myactivity.google.com కి నావిగేట్ చేయవచ్చు. గూగుల్ లెన్స్‌ ఉపయోగించి సెర్చ్ చేసిన అన్ని ఫొటోలను వీక్షించేందుకు ఈ పేజీ అనుమతిస్తుంది. ఇంకా, భవిష్యత్ వాడకం కోసం ఈ ఫొటోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఈ ఫీచర్ కు సంబంధించి సెట్టింగ్ మీ ఫోన్ లో ఆఫ్ చేయబడి ఉంటుంది. వినియోగదారులు దీన్ని మాన్యువల్‌గానే ప్రారంభించాలి. ఈ సెట్టింగ్ లను ఆక్టివేట్ చేసేందుకు పైన పేర్కొన్న వెబ్‌పేజీకి వెళ్లి, ‘డేటా & గోప్యత’, ఆపై ‘వెబ్ & యాప్ యాక్టివిటీ’ని ఎంచుకోవాలి, ‘విజువల్ సెర్చ్ హిస్టరీని చేర్చ్’పై టోగుల్ చేయాలి.

ఈ ఫీచర్ ఫంక్షన్ ప్రస్తుతం రోల్ అవుట్‌లో ఉంది. ఇది రాబోయే వారాల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు తమ ఫోన్లలో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చినప్పుడు పాప్ అప్ ద్వారా ఫీచర్ గురించి నోటిఫికేషన్‌ను పొందుతారని గూగుల్ చెప్పింది.

ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీపై గూగుల్ ‘AI జెమిని’ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై గూగుల్ భారత ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పింది. ఈ విషయాన్ని ఐటీ & ఎలక్ట్రానిక్స్ సహాయ మంత్రి చంద్రశేఖర్‌ తెలిపారు.

TAGS