Google Earth : గూగుల్ ఎర్త్ ప్రో ద్వారా 20 సంవత్సరాల వెనక్కి వెళ్లచ్చు..
Google Earth : టెక్నాలజీ చాలా డెవలప్ అయ్యింది. ఎంతలా అంటే గతాన్ని కూడా చూసేంతగా. అవునండీ మీరు విన్నది నిజమే. అది కూడా దాదాపు 20 సంవతవ్సరాల వరకు వెనక్కి వెళ్లచ్చు. ఇది చాలా ఇంట్రస్టింగ్ న్యూస్ కదా.. ఒక ప్రాంతం లేదంటే ప్రదేశం ఇప్పుడు మన ముందు ప్రజెంట్ లో ఎలా ఉందో మనం కంటి ద్వారా చూస్తాం.. ఒక ఐదేళ్లు, లేదంటే పదేళ్ల వరకు ఆ ప్రదేశం ఎలా ఉంటుంటో గుర్తుంటుంది అంతే.. కానీ చూడలేం.. అదే ఫొటోలు, వీడియోలు ఉంటే వేరు లెండి. కనీ ఇవేవీ లేకుండా దాదాపు 20 వరకు ఆ ప్రదేశాన్ని చూడచ్చు అది కూడా నెట్ లో.. దీని కోసం గూగుల్ ప్రో అనే ఒక యాప్, డెస్క్ టాప్ ను గూగుల్ తీసుకువచ్చింది. యాప్ ఇన్ స్టాల్ చేసుకొని ఆ ప్రదేశానికి వెళ్లి 20 సంవత్సరాల క్రితం ఆ ప్రదేశం ఎలా ఉందో చూడాలనుకుంటే ఇది అక్కడి వరకు తీసుకెళ్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ ప్రదేశాన్ని కొన్నేల్ల వెనక్కు వెళ్లి చూసుకోవచ్చు..
View this post on Instagram