National Award Winner : 12th ఫెయిల్యూర్ ఇండస్ట్రీని ఊపేసిన మూవీ ఇదీ. అందులో నటనకు హీరో విక్రాంత్ కు ప్రశంసలు కురిసాయి. బాలీవుడ్ లో ఇంటెన్స్ నంబర్ 1 యాక్టర్ గా గుర్తింపు దక్కాయి. అయితే అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. అయినా కూడా ఆ నేషనల్ హీరో నటనకు గుడ్ బై చెప్పడం సినీ ఇండస్ట్రీలో అందరినీ షాక్ కు గురిచేసింది. ఆయన ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నాడన్నది హాట్ టాపిక్ గా మారింది.
12th ఫెయిల్యూర్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ హీరో విక్రాంత్ మాస్సే నటనకు వీడ్కోలు పలికాడు. 2025 తర్వాత నటనకు విరామం ఇస్తున్నట్లు ప్రకటించి సంచలనం రేపారు.. ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో మంచి పురోగతి సాధించామని, తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
తండ్రిగా, కొడుకుగా, భర్తగా బాధ్యతలు నిర్వర్తించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇక విక్రాంత్ నిర్ణయం అభిమానులను షాక్ కు గురి చేసింది.