DSC Notification : ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు తిపి కబురు అందింది. త్వరలో వారి ఆశలు తీరనున్నాయి. డీఎస్సీ నోటిఫికేషన్ వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటన తదనంతర పరిణామాలు నిరుద్యోగులకు ఊరట కలిగిస్తున్నాయి. ఇన్నాళ్లు ఉద్యోగాల కోసం వేచి చూసిన వారి కలలు త్వరలో నిజం కాబోతున్నాయని తెలుస్తోంది. సంక్రాంతి తరువాత తీపి కబురు చెబుతామని ప్రకటించిన మంత్రి అధికారులతో సమావేశమై జిల్లాల వారీగా ఖాళీల వివరాలు సేకరించడంపై నిరుద్యోగుల్లో ఉత్సాహం కలుగుతోంది.
ఉద్యోగాల కోసం వేచి చూసిన తమ కలలు నిజం అయ్యే రోజు వస్తోందని సంబరాలు పడుతున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ వేస్తే వేలాది మందికి ఉద్యోగం దొరుకుతుంది. నిరుద్యోగం కొంతవరకైనా తీరుతుంది. టీచర్ల నియామకాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. సుమారు 6 వేల నుంచి 10 వేల వరకు పోస్టులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎస్జీటీ పోస్టులే ఎక్కువగా ఉన్నాయని సమాచారం.
18,500 పోస్టులు ఖాళీలున్నట్లు గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రకటించింది. పది రోజుల క్రితమే డీఎస్సీ నోటిఫికేషన్ పై మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటన చేయడంతో ఇక ప్రక్రియ వేగవంతం అవుతుందని చెబుతున్నారు. త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పడంతో నిరుద్యోగుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది.
ఇన్నాళ్లు ఉద్యోగాల కోసం వేచి చూసిన నిరుద్యోగులకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తాననడంతో పోయిన ప్రాణాలు తిరిగొచ్చినట్లు అయింది. ఉద్యోగాల కోసం ఎదురు చూసిన వారికి డీఎస్సీ ప్రాణం పోసినట్లు అయిందని నిరుద్యోగులు భావిస్తున్నారు. త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసి పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టబోతున్నట్లు పరిణామాలు చూస్తే తెలుస్తోంది.