Telangana : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వయోపరిమితి పెంపు..త్వరలోనే వరుస నోటిఫికేషన్లు

Good news for unemployed..

Telangana Government Good news for unemployed..

Telangana : ‘నీళ్లు, నిధులు, నియామకాలు..’ అనేది తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్. వీటి కోసమే దాదాపు 58 ఏండ్లుగా తెలంగాణ ప్రజలు పోరాటం చేశారు. స్వరాష్ట్రం వస్తేనే ఈ మూడింటిపై మన ఆధిపత్యం వస్తుందని భావించారు. ఈ పోరాటంలో ఎంతో మంది అసువులు బాశారు. మరికొందరు జైలుపాలయ్యారు. ఇక మలివిడత ఉద్యమంలో ముందుండి పోరాడింది విద్యార్థులే. తెలంగాణ సకల జనం పోరాట ఫలితంగా తెలంగాణ వచ్చింది. ఉద్యమ పార్టీ అయిన టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఉద్యమ నాయకుడు కేసీఆర్ సీఎం అయ్యారు. ఇక తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాల జాతర ఉంటుందని భావించారు. కానీ ఏండ్లుగడిచినా ఉద్యోగం రాలేదు. ఏదో కొన్ని డిపార్ట్ మెంట్లలో ఉద్యోగాలు వేశారు. లక్షల్లో ఉన్న నిరుద్యోగులకు వేలల్లో ఉద్యోగాలు వేశారు. దీంతో నిరుద్యోగుల సంఖ్య పెరిగిందే తప్ప తగ్గలేదు.

టీఆర్ఎస్(బీఆర్ఎస్) గత పదేండ్ల కాలంలో ఒక్క గ్రూప్ -1 రిక్రూట్ మెంట్ ఇవ్వలేదు. ఒక్కటే గ్రూప్-2 నోటిఫికేషన్, ఒక్క డీఎస్సీ మాత్రమే వేసింది. ఇక ఎన్నికల వేళ గ్రూప్-1 సహ మిగతా పోస్టులకు రిక్రూట్ మెంట్ చేపట్టింది కానీ.. అన్నీ లీకేజీలు, రద్దు, వాయిదాలతో నిరుద్యోగులను అరిగోస పెట్టింది. దీంతో బీఆర్ఎస్ పై ఆగ్రహంతో నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ తో పాటు ఈ ఏడాది 2లక్షల పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తాను ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తోంది. ఇవాళ రేవంత్ సర్కార్ ఓ కీలక నిర్ణయం తీసుకుని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే గరిష్ట వయోపరిమితిని రెండేళ్లు పెంచింది. ఈమేరకు అసెంబ్లీ సాక్షిగానే జీవో జారీ చేసింది. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్న 44 ఏండ్ల నుంచి 46 ఏండ్ల వరకూ ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. దీంతో వేలాది మంది సీనియర్లకు ఇది బిగ్ రిలీఫ్ అని చెప్పాలి. ఇక ప్రభుత్వం 563 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ చేయడానికి కసరత్తు చేస్తోంది. అలాగే డీఎస్సీ, 15వేల పోలీస్ ఉద్యోగాలును భర్తీ చేయనుంది.

TAGS